డీజీపీతో సినీ నటి రెజీనా సందడి (ఫోటోలు)

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రజలు బాధ్యతగా భావించాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ సూచించారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో 27వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా, పోలీస్ శాఖ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, మారుతి సుజుకి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టాలీవుడ్ నటి రెజీనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. జీవితం ఎంతో విలువైందని, దానిని కాపాడుకోవడానికి అందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ వాకథాన్ పీపుల్స్‌ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగింది.

 డీజీపీతో సినీనటి రెజీనా సందడి

డీజీపీతో సినీనటి రెజీనా సందడి


వాకథాన్‌ను డీజీపీ అనురాగ్ శర్మ, రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, అడిషనల్ డీజీ (రోడ్‌సేఫ్టీ) కృష్ణ ప్రసాద్, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానీయా, సినీ నటి రెజీనా, ఐఎఫ్‌ఆర్‌ఓఎస్ సంస్థ వ్యవస్థాపకులు కనుమల వినోద్ కుమార్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.

డీజీపీతో సినీనటి రెజీనా సందడి

డీజీపీతో సినీనటి రెజీనా సందడి


ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వాహనదారుల అజాగ్రత్త వల్లే 80 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. హెల్మెట్ ప్రాణానికి రక్షణగా నిలుస్తుందన్నారు.

డీజీపీతో సినీనటి రెజీనా సందడి

డీజీపీతో సినీనటి రెజీనా సందడి


డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో నాలుగు నెలల్లో 2 వేల మందికి జైలు శిక్ష విధించడం జరిగిందని, ఒక్కసారి జైలు శిక్ష అనుభవిస్తే అది వారి కేరీర్‌ను దెబ్బతిస్తుందని చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు అన్ని జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతాయన్నారు.

డీజీపీతో సినీనటి రెజీనా సందడి

డీజీపీతో సినీనటి రెజీనా సందడి

అడిషనల్ డీజీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో గంటకు ఒక ప్రాణం పోతుందన్నారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి సునీల్ శర్మ మాట్లాడుతూ ఇతరులు చెప్పే వరకు వీనేకంటే ప్రజలు తమంతట తామే అవగాహన పొందాలని సూచించారు.
 డీజీపీతో సినీనటి రెజీనా సందడి

డీజీపీతో సినీనటి రెజీనా సందడి


ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుకుంటే డ్రంకన్ డ్రైవ్ కేసులను కఠినతరం చేయడంతో 460 నుంచి 350కి తగ్గాయన్నారు. వచ్చే నెల నుంచి లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపే వారికి మూడు రోజుల జైలు శిక్షను సైతం విధించాలనే నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

డీజీపీతో సినీనటి రెజీనా సందడి

డీజీపీతో సినీనటి రెజీనా సందడి


జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రఘునాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+