టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'(ఫోటోలు)
హైదరాబాద్: ఎయిర్ ఏషియా తన నాల్గవ విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీన్ని ఆవిష్కరించారు. జేఆర్‌డీ టాటా గౌరవార్ధం ఆయన ఫోటోతో దీనిపై ముద్రించారు.
దేశీయ పౌర విమానయాన సేవలకు ఆద్యుడైన జేఆర్‌డీ టాటాను గుర్తు చేసుకుంటూ, 'ద పయనీర్' పేరుతో ఈ విమానాన్ని ప్రయాణికుల సేవల్లోకి ప్రవేశపెడుతున్నట్లు ఎయిర్ ఏషియా వర్గాలు వెల్లడించాయి.
'ద పయనీర్' విమాన ఆవిష్కరణ కార్యక్రమానికి టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, ఎయిర్ ఏషియా ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎస్.రామదొరై, ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిత్తు చండిల్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా టాటా ఎయిర్ ఏషియా సీఈఓ మిత్తు చండిల్య మాట్లాడుతూ వచ్చే నెలలో మరో రెండు కొత్త ఎయిర్ బస్ ఏ320 విమానాలను ప్రవేశపెడుతున్నామని, ఇప్పుడున్న ఈ నాలుగు విమానాలకు ఆ రెండు అదనమని చెప్పారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతున్న విమానయాన రంగ రెక్కలు కట్టేసే సరికొత్త నిబంధనల పట్ల ఎయిర్ ఆసియా సిఇఒ టోనీ ఫెర్నాండేస్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
ఇలాంటి నిబంధనలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. విస్తరణకు, ఉపాధి కల్పనకు కంపెనీలు ముందుకు వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం అన్ని రకాలు సహకరించాలని సూచించారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
20 విమానాలు కలిగి ఉండి దేశంలో ఐదేళ్లు (5/20) సర్వీసులు నడిపించిన తర్వాతనే అంతర్జాతీయ సర్వీసులకు అనుమతివ్వాలని కొత్త నిబంధనల్లో ఉందని, ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఫెర్నాండెజ్అన్నారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
ఒక్క భారత్‌కే కాదు సింగపూర్, దుబాయ్, లండన్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విమానయాన రంగం చాలా కీలమని పేర్కొన్నారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
భారత విమానయాన రంగానికి భారీ స్థాయిలో పెట్టుబడుల అవసరం ఉందని, ఎక్కువ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తే వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే సేవలు లభిస్తాయని చెప్పారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
తమ లాభాలను కాపాడుకోవడానికి ఇలాంటి పన్నాగం పన్నుతున్న కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల్లో మరింత స్పష్టత కోరుతున్నామన్నారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
విమాన ఇంధనంపై అధిక పన్ను విధించడం పట్ల మిట్టు చాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తాము భావి వృద్ధిపై ఆశావాహ దృక్పథంతో ఉన్నామని చెప్పారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
ప్రస్తుతం తమ విమానాల సంఖ్య నాలుగుకు చేరిందని, వచ్చే నెలలో వీటి సంఖ్య ఆరుకు పెరుగుతుందన్నారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే నిర్వహణాపరంగా లాభనష్టాలు లేని స్థాయిను సాధించవచ్చనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

టాటా ఫోటోతో ఎయిర్ ఏషియా 'ద పయనీర్'
దేశీయ పౌర విమానయాన రంగానికి ఆద్యుడైన జెఆర్‌డి టాటా సేవలను స్మరిస్తూ ఆయనకు తన నాలుగో విమానాన్ని ఎయిర్ ఆసియా ఇండియా అంకితమిచ్చింది. ఈ విమానంపై జేఆర్‌డీ టాటా ఫోటోలను ముద్రించారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications