ఆర్మీ చరిత్రలోనే అరుదైన ఘట్టం : వీర శునకానికి శౌర్య పతకం
న్యూఢిల్లీ: భారతీయ ఆర్మీ చరిత్రలోనే తొలిసారిగా ఓ శునకానికి శౌర్య పతకం లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టెర్రరిస్టుల చొరబాట్లను గట్టిగా ప్రతిఘటించి.. చివరికి తన ప్రాణాలు కోల్పోయిన ప్రాదేశిక సైన్యం డాగ్ స్క్వాడ్ లోని 'మానసి' అనే శునకానికి ఈ అరుదైన ఘనత దక్కింది.
ఉత్తర కశ్మీర్ లో సరిహద్దులో టెర్రరిస్టుల చొరబాట్లను పసిగట్టి సైన్యానికి సమాచారం అందించేందుకు గాను 160 ప్రాదేశిక సైన్యం డాగ్ స్క్వాడ్ ను ఉపయోగించుకుంటుంది. ఇందులోనే నాలుగేళ్ల మానసి, దాని సంరక్షణ కోసం నియమించబడ్డ బషీర్ అహ్మద్ వార్ పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే గతేడాది జూలై 21న తంగధర్ సరిహద్దు వద్ద పహారా ఉన్న సమయంలో.. భారత్ లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను మానసి గుర్తించింది. ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునేందుకు గట్టిగా ప్రతిఘటించిన మానసి, బషీర్ లను ముష్కరులు తమ తుపాకీ తూటాలతో బలి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో.. మానసి, బషీర్ సేవలను గుర్తించిన కేంద్రం.. ఆదివారం నాడు మానసికి 'మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్' సర్టిఫికెట్ ను, బషీర్ కు సేనా మెడల్ ను ప్రకటించింది.












Click it and Unblock the Notifications