హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంతోషం: చండీగఢ్ టాప్, హైదరాబాద్‌లో తక్కువే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలోనే అత్యంత సంతోషమయ జీవితాన్ని చండీగఢ్ వాసులు గడుపుతున్నారని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్ధ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రజల జీవన ప్రమాణ స్ధాయి, సంపాదనతో పాటు కుటుంబం కోసం గడిపే విలువైన సమయం, వివిధ లక్ష్యాలను చేరుకోవడం వివిధ అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.

దేశంలోని 16 ప్రముఖ నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొదటి స్ధానంలో చండీగఢ్ నిలవగా, ఆఖరిస్ధానంలో గౌహతి నిలిచింది. ముంబై, పాట్నా, జైపూర్, కొచ్చి, హైదరాబాద్ వెనకనుంచి టాప్ -5 స్ధానంలో నిలిచాయి.

 Chandigarh happiest city in India, Guwahati least: Survey

ఇక మెట్రో నగరాల విషయానికి వస్తే ఢిల్లీ ప్రజలు సంతృప్తిగా జీవిస్తున్నామని తెలిపితే ముంబై వాసులు మాత్రం జీవితం గొప్పగా లేదని స్పష్టం చేశారు. ఇక దిక్కులను ఆధారం చేసుకుని ప్రకటించిన జాబితాలో ఉత్తర భాగంలో చండీగఢ్ తొలిస్థానం, జైపూర్ చివరిస్థానం, ఇక తూర్పు దిక్కున తొలిస్ధానం పాట్నా, చివరి స్థానం గౌహతి ఉంది.

దేశంలోని ఒక్కో ప్రాంతం నుంచి వివిధ ఆర్ధిక, సామాజిక వర్గాలకు చెందిన 150 మందిని శాంపిల్‌గా తీసుకుని ఈ సర్వే నిర్వహించారు.

English summary
People of Chandigarh are happiest in the country while those of Guwahati are least happy, a survey said. The survey conducted by South Korean electronics firm LG showed, amongst the metros, people in Delhi are the happiest while those in Mumbai are the least happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X