వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారా హుషార్: తెలంగాణపై డెంగ్యూ ఎటాక్.. తర్వాతీ వరుసలో...

తెలంగాణ జిల్లాల్లో అప్పుడే విష జ్వరాలు, అంటు వ్యాధులు మళ్లీ విజృంభిస్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వాతావరణంలో మార్పులు, కురుస్తున్న వర్షాలు, నిలుస్తున్న నీరు, పెరిగిపోతున్న అపరిశుభ్రత వంటి కారణాల మూలంగా దోమల స్వైర విహారం. తెలంగాణ జిల్లాల్లో అప్పుడే విష జ్వరాలు, అంటు వ్యాధులు మళ్లీ విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఇప్పటికే నమోదయ్యాయి.

కరీంనగర్, భద్రాద్రి - కొత్తగూడెం, యాదాద్రి - భువనగిరి జిల్లాల పరిధిలో సుమారు 44 డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయి. మలేరియా ప్రభావం కూడా ధాటిగానే ఉందని, అదే సమయంలో స్వైన్ ఫ్లూ వ్యాధితోనూ ప్రజలు బాధ పడుతున్నారని తాజా పరిణామాలు చెప్తున్నాయి. కాకపోతే సీజన్ ప్రారంభానికి ముందే రాష్ట్రమంతటా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి స్వయంగా చెబుతారు.

వసతులకు దూరంగా ఉండే అసిఫాబాద్ - కుమ్రం భీం, నిర్మల్, జయశంకర్ - భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ జ్వర పీడితుల సంఖ్య భారీగానే ఉంటుంది. కరీంనగర్‌లో మలేరియా జ్వరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చేస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జ్వరాల సీజన్‌ ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో జ్వరాల వార్డులు కిటకిటలాడుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించకపోతే డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది.

డెంగ్యూ ఫీవర్‌తో ముగ్గురికి చికిత్స

డెంగ్యూ ఫీవర్‌తో ముగ్గురికి చికిత్స

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఒకటి రెండు స్వైన్‌ఫ్లూ కేసులు కూడా నమోదుకావడం కలకలం రేపుతోంది. కరీంనగర్‌ నగరం గోదాంగడ్డ వాసి నాలుగేళ్ల గౌరు అనే బాలికకు తీవ్ర జ్వరం వచ్చింది. రక్తపరీక్షలు చేయించగా డెంగ్యూ అని తేలడంతో ఈనెల 24 నుంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాలిక కోలుకుంటోంది. కరీంనగర్‌ మండలం దుర్శేడు గ్రామ నివాసి తిరుపతిగౌడ్‌(35) జ్వరంతో బాధపడుతుండగా డెంగ్యూ అని తేలింది. ఈ నెల 22 నుంచి చికిత్స చేయించుకుంటున్నారు.

హుజురాబాద్‌ మండలం బోర్నపల్లి వాసి రవీందర్‌(25) ఈనెల 8న నుంచి డెంగ్యూతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గత జనవరి నుంచి మార్చి వరకు మరో 6 డెంగ్యూ జ్వరం కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. రామడుగు మండలం పందికుంటపల్లి గ్రామంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న వారి వివరాలు మాత్రం జిల్లాలో నమోదు కాలేదు. కరీంనగర్ జిల్లా మొత్తం మీద జ్వరాల బారీన పడి డెంగ్యూ జ్వరాలుగా అనుమానించిన 952 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం పంపించగా, జనవరి నుంచి ఇప్పటి వరకు 9 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో 3 కేసులు ఈ నెలలోనే నమోదు కావడం గమనార్హం.

రోగులతో కరీంనగర్ ఆసుపత్రి కిటకిట

రోగులతో కరీంనగర్ ఆసుపత్రి కిటకిట

ఈ ఏడాది కరీంనగర్‌ నగర పాలక సంస్థలోని పలు డివిజన్‌ల పరిధిలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. స్థానిక గాంధీ రోడ్డులోని దేవరాజ్‌ (30) మలేరియా జ్వరంతో బాధపడుతూ గత నెలలో చికిత్స పొందారు. ఆరేళ్ల సాయికల్ప ఈ నెలలో మలేరియా బారిన పడి చికిత్స పొందారు. కిసాన్‌నగర్‌, బోయవాడ, హుస్సేనిపుర, శర్మనగర్‌, హమత్‌పురతో పాటు రామడుగు, బావుపేట గ్రామాల్లో 7 కేసులు నమోదయ్యాయి. దోమలతో మలేరియా బాధితులు పెరిగే అవకాశం ఉంది. కరీంనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో జ్వరాల వార్డు కిటకిటలాడుతోంది.. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా జ్వరాల బారీన పడుతున్నారు. రోగుల సంఖ్య పెరుగడంతో ప్రభుత్వాసుపత్రిలో కొందరికి వరండాలోనే మంచాలు వేసి వైద్యం అందిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద 47,952 మంది సాధారణ, ఇతర జ్వరాల బారీన పడ్డారు.

పారిశుద్ధ్యంపై పట్టింపు కరవు

పారిశుద్ధ్యంపై పట్టింపు కరవు


హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి గ్రస్తులున్నట్లు నిర్ధారణ కావడంతో కరీంనగర్‌ జిల్లా ప్రజలు కూడా భయపడుతున్నారు. గతంలో కరీంనగర్‌కు చెందిన ఒక మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కరీంనగర్‌లోని ఒక ప్రధాన పార్టీ ముఖ్య నేత కుటుంబ సభ్యులు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొంది వచ్చినట్లు సమాచారం. కాగా రాజన్న- సిరిసిల్ల జిల్లాలో ఒకరు మృతి చెందడం కూడా జిల్లా ప్రజలను భయానికి గురి చేస్తోంది. కరీంనగర్‌లో మలేరియాతో పాటు డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నా పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించడం లేదు. నీటిలో నిలువ ఉండే దోమలతో జ్వరాలు సంభవిస్తాయని వైద్య అధికారులు చెబుతున్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఇప్పుడే నమోదవుతున్నాయని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందులు సిద్ధంగా ఉన్నాయని, వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేశం తెలిపారు.

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో పెరుగుతున్న రోగులు

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో పెరుగుతున్న రోగులు

భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. జిల్లాలో మూడు నెలల్లోనేఒక్క ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు పొందిన జ్వరబాధితులే 65వేల పైచిలుకు ఉండటం గమనార్హం. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్న వారి సంఖ్యతో కలిపితే ఇది లక్షల్లో ఉంటుంది. ఈ ఏడాదీ ప్రజలను భయపెడుతున్న డెంగ్యూ భూతం ప్రైవేటు వైద్యులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉండే భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తుంగారం, చంద్రుగొండ, కొత్తగూడెం, సింగభూపాలెం, టేకులపల్లి, ఆళ్లపల్లి, చర్ల, పాల్వంచ, రాఘవాపురం ఇలా పలు ప్రాంతాల నుంచి ప్రజలు జ్వరాల బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే సగటున ప్రతీ రోజు 150 మంది చికిత్సల కోసం వస్తున్నారు.

జిల్లా ఆసుపత్రిగా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి మారడంతో ఆయా మండలాల నుంచి కొత్తగూడెం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్క జిల్లాకేంద్రంలోనే ఇప్పటివరకు 15 డెంగ్యూ జ్వర పీడితులు చికిత్స పొందుతూ సాధారణ స్థితికి చేరుకున్నారు. అందులో కొత్తగూడెం రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఒక అధికారి సైతం ఉన్నారు. పదిరోజుల క్రితం వరకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఒక రెవెన్యూ అధికారి మంచానపడ్డారు. ఇంట్లోనే డెంగ్యూ నివారణకు వైద్యసేవలు పొందుతున్నారు. వారంపాటు వైద్యచికిత్సలు తీసుకునేందుకు సెలవులో ఉన్న ఆ అధికారి ఇటీవలే కోలుకుని విధుల్లోకి చేరారు. ఒక కౌన్సిలర్‌ ఇంట్లో కుటుంబీకులు సైతం డెంగ్యూ బారిన పడ్డారు.

వారు సైతం సత్వరంగా వైద్యసేవలు పొందారు. కానీ అధికారికంగా లెక్కల్లో మాత్రం అధికారులు ఈ సంఖ్యను జిల్లా వ్యాప్తంగా కేవలం 11 గానే లెక్కల్లో పేర్కొంటున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితుల సంఖ్య 30 పీహెచ్‌సీల పరిధిలో 86వేల వరకు చేరగా, డెంగ్యూ బాధితుల సంఖ్య 44 వరకు చేరింది. నాలుగు నెలల క్రితం కొత్తగూడెంలో కలెక్టర్‌, అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సమయంలో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పారిశుద్ధ్యంలో వైఫల్యాలను ప్రస్తావించారు. అయినా పరిస్థితుల్లో మార్పు మాత్రం కానరావడం లేదు.

నాలుగు స్వైన్ ప్లూ కేసులు నమోదు.. ప్రబలుతున్న విష జ్వరాలు

నాలుగు స్వైన్ ప్లూ కేసులు నమోదు.. ప్రబలుతున్న విష జ్వరాలు

యాదాద్రి - భువనగిరి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మూసీ నది కలుషిత జలాలను మోసుకొస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. జిల్లాలో పలుచోట్ల ఇప్పుడిప్పుడే వైరల్‌ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. అక్కడక్కడా డయేరియాతో బాధపడుతున్నారు. ఏడాది కాలంగా జిల్లాలో ఎక్కడా ఎపిడమిక్‌గా కనిపించడం లేవు. ఒకటి, రెండు కేసులు మినహా మలేరియా, స్వైన్‌ఫ్లూ బాధితులు గత ఏడాదిగా కనిపించలేదు.

వైద్యఆరోగ్య శాఖ గత జనవరి నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం 37,740 మంది నుంచి మలేరియా అనుమానిత పూతలు సేకరించగా ఇద్దరికి మాత్రమే నిర్ధరణ అయింది. బొల్లేపల్లి పీహెచ్‌సీ పరిధిలో సూరెపల్లిలో ఒకరికి, మోటకొండూరు పరిధిలోని కాటపల్లిలో మరొకరికి పాజిటివ్‌గా వచ్చింది. వెంటనే నివారణ చర్యలు చేపట్టారు. శారాజీపేట పీహెచ్‌సీ పరిధిలో 20 మంది అనుమానితులకు రక్త పరీక్షలు జరపగా ఒకరికి డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. జిల్లాలో నాలుగు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కొండమడుగులో ఒకే ఇంట్లో అన్నదమ్ములకు సోకగా అన్న మృతి చెందాడు. తమ్ముడు కోలుకున్నారు.

రాజపేటలో ఒకరు, బొమ్మలరామారం మండలం మైలారంలో మరొకరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధరించారు. గత ఏడాది మూసీ పరివాహక ప్రాంతమైన మక్తా అనంతారంలో విషజ్వరాలు ప్రబలాయి. వైద్య సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. తండాల్లో గతంలో అతిసార కేసులు ఎక్కువగా కనిపించేవి. ప్రతి ఒక్కరు శుద్ధి చేసిన నీరు సేవిస్తుండటంతో కేసులు ప్రస్తుతం భువనగిరి పట్టణం, బీబీనగర్‌, మోత్కూర్‌, చౌటుప్పల్‌ పరిధిల్లో జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దోమలతోనే జ్వరాల బారిన పడుతున్నారు. భువనగిరి ప్రాంతీయ ఆసుపత్రిలో 400 మంది బయటి రోగులను పరీక్షిస్తుండగా 200కు పైగా జ్వర పీడితులు, కొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. పీహెచ్‌సీల్లోనూ జ్వరం కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.

English summary
Viral, infectious fevers here in Telangana districts with recent Rains. Karim Nagar, Kothagudem, Yadadri - Bhongir districts affects with Dengue, Swine flu and Malaria fevers. 44 Dengue fever cases filed un officially. State Medical and Health Minister Dr Laxma Reddy said that their government ready to face viral fever in rainy season but real conditions are different.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X