పోలింగ్ కేంద్రానికి వీటిని తీసుకెళ్లొద్దు..!
దేశంలో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ రేపు (మే 13న) జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఏపీలోని 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా రేపే జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఇక, ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఓటువేసేందుకు తమ గ్రామాలకు వచ్చేసారు. అయితే, పోలీంగ్ రోజున ఓటువేసేందుకు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. వీటిని పోలింగ్ కేంద్రంలో నిషేదించడం జరిగింది. అవెంటో చూసేద్దాం. ఓటు వేయడానికి వెళ్లేవారు. మొబైల్ ఫోన్, కెమెరా వంటివి తీసుకెళ్లకూడదు.

ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లేవారు పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్, కెమెరా, ఇయర్ ఫోన్‌లు వంటి వాటిని తీసుకెళ్లకూడదు. ఎందుకంటే, పోలింగ్ బూత్ లోపలికి వీటిని తీసుకెళ్లడంపై నిషేదం విధించారు. కాబట్టి వీటిని ఇంట్లోనే ఉంచి వెళ్లడం ఉత్తమం. ఒకవేళ ఎవరైనా పొరపాటున తీసుకెళ్లినా, ఆ మొబైల్ ఫోన్‌ను ఆఫ్ చేయడం మంచిది. లేదంటే పోలింగ్ కేంద్రంలో ఉన్న భద్రతా సిబ్బందికి, పోలింగ్ సిబ్బందికి ఆ వస్తువులను ఇవ్వాల్సి ఉంటుంది.
ఓటింగ్ కేంద్రంలో మీ ప్రాంతంలోని బిఎల్ఓలు క్యాంపింగ్‌లో ఉంటారు. వారికైనా సరే మీరు తెచ్చిన పరికరాలను ఇచ్చేయొచ్చు. లేదంటే రాజకీయ పార్టీల ఏజెంట్ల దగ్గరైనా మీ మొబైల్ ఫోన్, కెమెరా వంటివి భద్రపరుచుకోవచ్చు అంతేగానీ, ఈ వస్తువులను తీసుకొని పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకూడదు. ఒకవేళ అలా తీసుకెళ్లిన పక్షంలో మీ దగ్గర ఉన్నవస్తువులను సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారు.
ఓటరు స్లిప్పుల్లో క్యూ ఆర్ కోడ్..
చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యలు ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించిన ఈసీ డిజటల్ ఓటర్ స్లిప్పులకు శ్రీకారం చుట్టింది. ఓటర్ స్లిప్పుల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. దీన్ని స్కాన్ చేయడం వల్ల మన పోలింగ్ కేంద్రం వివరాలు తెలుస్తాయి. పోలింగ్ కేంద్రానికి వెళ్లాలో రూట్ కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది. ఈ డిజిటల్ స్లిప్పుల్లో కర్నాటక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications