వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమిషాల్లోనే కొత్త పిన్‌ నెంబర్‌: ఏటీఏంకు వెళ్తే చాలు!

ఏటీఎం కేంద్రానికి వెళ్లి కొత్త ఏటీఎం పిన్‌ నెంబర్‌ను క్షణాల్లోనే పొందవచ్చు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు లభ్యత సమస్యను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదురహిత చెల్లింపులపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండటంతో పాటు ఏటీఎం కార్డులను వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఖాతాదారులంతా ఏటీఎం, డెబిట్‌, రూపే తదితర కార్డులను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

బ్యాంకుల్లో నగదు జమ చేయాలన్నా, ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలన్నా, స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా చెల్లింపులు చేపట్టాల్సి ఉన్నా ఏటీఎం లేదా క్రెడిట్ కార్డుల వినియోగం తప్పనిసరి అయిపోయింది. అయితే హడావుడిలో ఒక్కొక్కసారి ఏటీఎం పిన్‌ నెంబర్‌ను మరచిపోతుండటం సాధారణమే.

ఇక ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపే సమయంలో మూడుసార్లు తప్పుగా పిన్‌ నెంబర్‌ నమోదు చేసినా కార్డు ఇన్‌వేలిడ్‌ అనే సందేశం వస్తుంది. ఆపై ఆయా బ్యాంకు మేనేజర్లును సంప్రదించడం, లేదా టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఖాతాదారులు వారు వినియోగించే ఏటీఎం పిన్‌ నెంబర్‌ను ఒకానొక దశలో మరిచిపోతే ప్రస్తుత రోజుల్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు.

 How to change ATM PIN in a mintute

గతంలో అయితే ఏటీఎం పిన్‌ నెంబర్‌ మరచిపోతే బ్యాంకును ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉండేది. ఆ సమయంలో ఖాతాదారులు పలు అవస్థలకు గురవ్వడంతోపాటు కొత్త పిన్‌ నెంబర్‌ రావడానికి సుమారు 10 నుంచి 15 రోజులు వరకు సమయం పట్టేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.

ఖాతాదారులు ఏటీఎంలో డేబిట్‌ కార్డు ఉండగానే కంప్యూటర్‌ మోనిటర్‌పై పలు ఆప్షన్లు కనిపిస్తుంటాయి. ఇందులో బ్యాంకింగ్‌ ఆప్సన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిన్‌ జనేటర్‌, ఏటీఎం పిన్‌ రీసెట్‌ అని కనిపిస్తుంది. వీటిలో ఏదో ఒకటి క్లిక్‌ చేసి బ్యాంకు ఖాతానెంబర్‌ టైప్‌ చేయడంతోపాటు ఖాతాకు అనుసంధానం చేసిన ఫోన్‌ నెంబర్‌ను టైప్‌ చేయాల్సి ఉంటుంది.

ఇలా చేయడం ద్వారా ఫోన్‌కు ఒటీపీ(ఒన్‌టైమ్‌పాస్‌వర్డ్‌) వస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే చేంజ్‌ పిన్‌ నెంబర్‌ అన్న ఆప్షన్‌ను ఎంచుకోవల్సి ఉంటుంది. అనంతరం కొత్త పిన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసుకుంటే చాలు.. ఆ నెంబర్‌ తిరిగి యాక్టివేట్‌ అవుతుంది. ఇలా నిమిషాల్లోనే ఏటీఎం కొత్త పిన్‌ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

English summary
How to change ATM PIN in a mintute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X