హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాల్‌దర్వాజ: బంగారు బోనమెత్తిన కవిత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ బోనమెత్తుకుంది. పోతరాజుల నృత్యాలు.. అందంగా అలంకరించిన బోనాలు.. సంప్రదాయ మేళతాళాల మధ్య లాల్‌దర్వాజా బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆషాఢమాసం నాలుగో ఆదివారం జంట నగరాల్లోని పలు దేవాలయాల్లో బోనాల సంబురాలు వైభవంగా జరిగాయి.

లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం బోనాల జాతరకు వేలాదిగా భక్త జనం తరలివచ్చారు. సుమారు 10 వేల మందికి పైగా భక్తులు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఎ.మాణిక్‌ప్రభుగౌడ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అక్కన్న మాదన్న దేవాలయంలో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్ర్తాలు సమర్పించారు.

లాల్‌దర్వాజ అమ్మవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, తెరాస ఎంపీ కవిత, అధికార, అనధికార ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

బంగారు బోనమెత్తిన కవిత

బంగారు బోనమెత్తిన కవిత

పోతరాజుల నృత్యాలు.. అందంగా అలంకరించిన బోనాలు.. సంప్రదాయ మేళతాళాల మధ్య తెలంగాణలో ప్రసిద్ధి చెందిన లాల్‌దర్వాజా బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి.

మంత్రి తలసాని

మంత్రి తలసాని

మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు ఐదు వేల మంది బోనం సమర్పించారు.

మంత్రులు నాయిని, ఇంద్రకరణ్

మంత్రులు నాయిని, ఇంద్రకరణ్

రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, తెరాస ఎంపీ కవిత, అధికార, అనధికార ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

దానం నాగేందర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి

దానం నాగేందర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్‌లోని పాతబస్తీ బోనమెత్తుకుంది. నగరంలోని వీధి వీధి అమ్మవారి సేవలో తరించింది. ఆషాఢమాసం నాలుగో ఆదివారం జంట నగరాల్లోని పలు దేవాలయాల్లో బోనాల సంబురాలు ఘనంగా జరిగాయి.

బోనాలు

బోనాలు

లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం బోనాల జాతరకు వేలాదిగా భక్త జనం తరలివచ్చారు.

బోనాలు

బోనాలు

పోతురాజుల ఆటలు, డప్పు దరువులు, తప్పెట మోతలు, డోలు దెబ్బలు, శివసత్తులతో రాజధాని వీధులు మారుమోగాయి.

బోనాలు

బోనాలు

తెల్లవారుజామునుంచే అమ్మవారి దేవాలయాల వద్ద జనం బారులుతీరారు. అధికారిక పండుగ కోసం ఆకుపచ్చ తోరణాలు, విద్యుద్దీప వెలుగులు నడుమ నగరాన్ని అలరించారు.

బోనాలు

బోనాలు


ఆదివారం తెల్లవారుజామునే అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మేలుకొలుపు, హారతి కార్యక్రమం నిర్వహించి తొలిపూజను ప్రారంభించారు.

సిపిఐ నారాయణ

సిపిఐ నారాయణ

లాల్‌దర్వాజ అమ్మవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాలు

బోనాలు

మహంకాళికి మొక్కులు తీర్చుకునేందుకు తెల్లవారు జామునే భక్తులు క్యూ కట్టారు. జంటనగరాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.

సిపిఐ నారాయణ

సిపిఐ నారాయణ

హైదరాబాద్ బోనాల జాతరలను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో అధికారులు నగరంలోని దేవాలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా అలంకరించారు.

English summary
The annual Bonalu festival, dedicated to the Hindu goddess of power Mahankali or Kali and intended to ward off evil and usher in peace, was celebrated at the Mahankali temples in the Old City on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X