మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం (ఫోటోలు)
హైదరాబాద్: 'డివైన్ వాయిస్' పేరిట డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ సంగీత కచేరిని వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ డా. టి. సుబ్బరామిరెడ్డి ఆయనకు అక్కినేని స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేసి, అభినందించారు.
ఈ సందర్భంగా టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ 85 సంవత్సరాల వయస్సులోనూ స్వరంలో ఏమాత్రం వృద్దాప్యం కనపడనీయకుండా గానామృతాన్ని అందించడం చాలా గొప్ప విషయమన్నారు. స్వరబ్రహ్మా బాలమురళీకృష్ణకు భారతరత్న ఇవ్వాలని తెలుగువారమంతా పట్టబడదాం, కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
బాలమురళీకృష్ణకు సంపూర్ణ ఆయుస్సు ఇవ్వాలని జగన్మాతను పలునామాలతో టి.సుబ్బరామిరెడ్డి స్మరించాడు. కళాభారతి, సినీనటి జమున మాట్లాడుతూ బాలమురళీకృష్ణ సరస్వతి పుత్రుడు, మహానుభావుడు అని కొనియాడుతూ పాదాలకు నమస్కరించారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాంస్కృతిక సలహాదారుడు కెవి రమణాచారి మాట్లాడుతూ త్యాగరాజస్వామిని చూడలేకపోయామని బాధపడనవసరం లేదని బాలమురళీకృష్ణలో ఆయన్నిచూడవచ్చని అన్నారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
చివరగా స్వరబ్రహ్మా బాలమురళీకృష్ణ మాట్లాడుతూ తనను ఇంతకాలం ఆదరించి అభిమానిస్తున్నారని ఇదే ఆదరణ తాను ఉన్నంతకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి శిరోమణి వంశీ రామరాజు స్వాగతం పలుకగా తెన్నేటి సుధాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
అంతక ముందు వేదికపై మంగళంపల్లి బాలమురళీకృష్ణ కొన్ని నిమిషాలు రామదాసుగా మారిపోయి ‘పలుకే బంగారమాయెరా.. కోదండపాణి..' అంటూ ఆనంద భైరవి రాగంలో కీర్తనను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను రంజింప చేశారు. బెహాగ్ రాగంలో ‘నారాయణచే నమో నమో..' అన్నమాచార్య కీర్తనను ఆలపించారు.

మంగళంపల్లికి అక్కినేని స్వర్ణ కంకణం
సామ రాగంలో ‘శ్రీ సకల జనాధిప పాలయమాం..' వరసిద్ధి వినాయక శ్తోత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శోభిల్లు సప్తస్వర కీర్తనలో స్వరాలను ఆలపిస్తూ సహగాయకులు కృష్ణకుమార్, ఈలపాట శివప్రసాద్‌తో పోటీపడుతూ ఆలపించారు. అనంతరం సంగీతమే వరసుఖదాయమా కీర్తనను ఆలపించి శ్రోతలను సంగీత ప్రపంచంలో విహరింపజేశారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications