మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాలమూరు కొండల్లో నవీన శిలాయుగం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో నవీన శిలాయుగం జాడలు వెలుగుచూశాయి. ఆ కాలం నాటి ఆయుధాలు, పనిముట్లు, గుహాలయాలు పాలమూరు(మహబూబ్‌నగర్) జిల్లాలోని కోటగట్టు గుట్టపై లభించాయి. చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ పరిశోధనలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

ఇటీవల పాలమూరు జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పరిధిలోనున్న చెన్నయవొలం గుట్టల్లో నెలకొన్న ఒక కోవెలలో 17వ శతాబ్దంనాటి శాసనాన్ని ద్యావనపల్లి గుర్తించారు. ఈ శాసనానికి సమీపంలోని తిమ్మినోని చెరువుంది. శాసనంలోనూ నరహరి పేరిట ఒక చెరువు నిర్మించినట్లు ఉంది. వీటి ఆధారంగా రాజుల ఉనికి ఈ ప్రాంతంలో ఉండి ఉంటుందనే అనుమానంతో స్థానికుడు దొడ్డి రవిని ద్యావనపల్లి విచారించారు.

అతను చెన్నయవొలం గుట్టలకు సమీపంలోనే కోటగట్టు అనే గుట్ట ఉందని చెప్పాడు. దీంతో ద్యావనపల్లి కోటగట్టు గుట్ట ఎక్కి పరిశీలించగా.. కోట ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, ఆ గుట్టపై అనేక గుహల్లో నవీన శిలాయుగం నాటి పురావస్తు ఆధారాలు లభించాయి. మానవుడు ఆయుధాలకు వాడిన శిలాజాన్ని బట్టి చరిత్రకారులు ఆయా యుగాలకు పేర్లు పెట్టారు.

పాతరాతియుగపు ఆయుధాలు పెద్దగా, మొరటుగా ఉండేవి. మధ్యరాతియుగపు ఆయుధాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి ఆ యుగాన్ని సూక్ష్మరాతియుగం అని కూడా పిలుస్తారు. ఇక నవీన శిలాయుగం నాటికి మానవులు ఆయుధాలను నునుపుగా, పదునుగా తయారు చేయడం నేర్చుకున్నారు. ఈ ఆయుధాలతోనే సాగు చేయడం ప్రారంభించారు. సాగువల్ల మానవ జీవన గమనంలో మొట్టమొదటిసారిగా స్థిర నివాసం ఏర్పడింది.

అప్పుడప్పుడే మానవులు గుహల్లో నుండి మైదాన ప్రాంతాలకు వస్తున్నారు. కాబట్టి, వారు వాడిన ఆయుధాలు కొన్ని గుహల్లో కూడా లభిస్తున్నాయి. అలాగే నవీన శిలాయుగపు గొడ్డలి ఒకటి తిమ్మాయిపల్లి శివారులోని కోటగట్టు గుహలో లభించిందని ద్యావనపల్లి పేర్కొన్నారు.

నల్లసరపు రాయితో చేసిన నున్నని గొడ్డలితోపాటు చాలా కుండ పెంకులు లభించినట్లు ద్యావనపల్లి తెలిపారు. ఇదే గుహలో ఒక ఎరుపు రజనునిచ్చే రాయి కూడా దొరికిందని.. ఆ రాయిని మరో రాయిమీద రుద్దితే ఎరుపురంగు పొడి రాలుతున్నదని చెప్పారు. గుహ పైకప్పు రాళ్లు కూలిపోయి పక్కనే ఎరుపు చారలతో కన్పిస్తుండటాన్ని బట్టి.. ఆ గుహల్లో ఒకప్పుడు ఎరుపురంగు బొమ్మలు వేశారని అర్థమవుతున్నదని పేర్కొన్నారు.

అలాంటి రంగు బొమ్మల గుహనే కొత్తరాతియుగ ప్రజలు దేవాలయంగా కొలిచేవారని తెలిపారు. ఆ దేవాలయాన్ని వేల ఏల ఏళ్ల కిందటే ప్రజలు మెట్లెక్కి చేరుకునేవారనడానికి.. నిదర్శనంగా ఆ గుహలో పెద్ద మెట్లు తొలిచిన రాయి కూడా కన్పించిందని వెల్లడించారు.

మరిన్ని గుహావాసాలు:

నవీన శిలాయుగం జాడలు

నవీన శిలాయుగం జాడలు

తెలంగాణ రాష్ట్రంలో నవీన శిలాయుగం జాడలు వెలుగుచూశాయి. ఆ కాలం నాటి ఆయుధాలు, పనిముట్లు, గుహాలయాలు పాలమూరు(మహబూబ్‌నగర్) జిల్లాలోని కోటగట్టు గుట్టపై లభించాయి.

నవీన శిలాయుగం జాడలు

నవీన శిలాయుగం జాడలు

చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ పరిశోధనలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

నవీన శిలాయుగం జాడలు

నవీన శిలాయుగం జాడలు

ఇటీవల పాలమూరు జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పరిధిలోనున్న చెన్నయవొలం గుట్టల్లో నెలకొన్న ఒక కోవెలలో 17వ శతాబ్దంనాటి శాసనాన్ని ద్యావనపల్లి గుర్తించారు.

నవీన శిలాయుగం జాడలు

నవీన శిలాయుగం జాడలు

ఈ శాసనానికి సమీపంలోని తిమ్మినోని చెరువుంది. శాసనంలోనూ నరహరి పేరిట ఒక చెరువు నిర్మించినట్లు ఉంది. వీటి ఆధారంగా రాజుల ఉనికి ఈ ప్రాంతంలో ఉండి ఉంటుందనే అనుమానంతో స్థానికుడు దొడ్డి రవిని ద్యావనపల్లి విచారించారు.

కోటగట్టు

కోటగట్టు

అతను చెన్నయవొలం గుట్టలకు సమీపంలోనే కోటగట్టు అనే గుట్ట ఉందని చెప్పాడు. దీంతో ద్యావనపల్లి కోటగట్టు గుట్ట ఎక్కి పరిశీలించగా.. కోట ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, ఆ గుట్టపై అనేక గుహల్లో నవీన శిలాయుగం నాటి పురావస్తు ఆధారాలు లభించాయి.

ఈ గుహాలయానికి పైన ఉత్తరంవైపు మరికొన్ని గుహల సముదాయాలున్నాయని ద్యావనపల్లి తెలిపారు. ఒక గుహ చీలిక మరిన్ని గుహావాసాలకు దారి తీస్తున్నదని.. ఆ గుహావాసాల గుండా ముందుకు సాగిపోతే గుట్ట శిఖరాగ్రానికి చేరుకోవచ్చని చెప్పారు. అయితే, గుహావాసాలు చీకటిగా ఉండటం వల్ల ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయినా గుహ చీలికలో మాత్రం కడవలు, కుండలు, గురుగులు, సొంగ కుండలు మొదలుకొని అనేక రకాల పెంకులు లభించాయని పేర్కొన్నారు.

నవీనశిలాయుగంలో కుమ్మరి చక్రం కనుక్కొన్నారనడానికి ఈ పెంకులు నిదర్శనమని తెలిపారు. పూర్వం ఇవే గుహల్లో స్థానికులు కొందరు (ఇప్పుడు ముసలివాళ్ళు) రోళ్లు, రోకలిబండలు, ఊకను కూడా చూసినట్లు చెప్తున్నారని ద్యావనపల్లి వెల్లడించారు. ఏది ఏమైనా తిమ్మాయిపల్లి కోటగట్టు గుహల్లో నవీన శిలాయుగంలో మానవ జీవనం మనుగడ సాగించింది నిజమని స్పష్టమైన ఆధారాలు చెప్తున్నాయి. దానిని శాస్త్రీయంగా పురావస్తుశాఖ వెలికి తీయాల్సిన అవసరం ఉంది.

English summary
Neolithic culture founded in Thimmaipally in Mahabubnagar district by Chronicler Satyanarayana Dyavanapalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X