శాస్త్రవేత్తలకు కిమ్ విందు: అణు పరీక్షల వెనుక ఆ ఇద్దరే!

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా వరుసగా 6 దఫాలు అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలకు కిమ్‌ ఆదివారం నాడు విందు ఇవ్వనున్నారు.

ఇటీవల కాలంలో ఉత్తరకొరియా నిర్వహించిన అణు పరీక్షల వెనుక ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తల కృషి కీలకమైంది. దీంతో శాస్త్రవేత్తలను అభినందిస్తూ వారికి విందు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.

కిమ్‌కు షాక్: సైనిక చర్యకు రెఢీ, ఉ.కొరియాపై ట్రంప్ నిప్పులు

69వ, ఉత్తరకొరియా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరోసారి అణు పరీక్షలకు ఆ దేశం సిద్దమయ్యే అవకాశం ఉందని దక్షిణ కొరియా హెచ్చరించింది. కానీ, ఇప్పటివరకు 6 దఫాలు మాత్రమే ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించింది.

కిమ్‌కు చైనా షాక్: సరిహద్దులో మిలటరీ డ్రిల్, ఉ.కొరియాకు దెబ్బేనా?

అయితే ఉత్తరకొరియా ఎప్పుడు ఏం చేస్తోందనే విషయమై దక్షిణ కొరియా కూడ ఆ దేశంపై ఓ కన్నేసి ఉంచింది. ఉత్తరకొరియాను ఎదిరించేందుకు దక్షిణ కొరియాకు అమెరికా సహయం చేస్తోంది. అయితే తాజాగా చైనా కూడ ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా మాట్లాడడం ఉ.కొరియాకు ఇబ్బందిగా మారింది.

శాస్త్రవేత్తలకు కిమ్ విందు

శాస్త్రవేత్తలకు కిమ్ విందు

ఉత్తర కొరియా అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, అమెరికా హెచ్చరించినా కానీ, ఉత్తరకొరియా మాత్రం తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు. అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన శాస్త్రవేత్తలకు కిమ్ విందు ఇచ్చారు. అయితే ఈ విందు శనివారం నాడు జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విందులో కిమ్‌తో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ మేరకు ఫోటో సెషన్స్ మీడియాలో వెలువడింది.

ఆ ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు కూడ విందులోనే

ఆ ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు కూడ విందులోనే

ఉత్తరకొరియా నిర్వహించిన అణు పరీక్షల్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు కూడ కిమ్‌తో పాటు ఈ విందులో పాల్గొన్నారు. మీడియాలో ప్రచురించిన ఈ ఫోటోలో కిమ్‌కు సన్నిహితంగా వారు కన్పించారు. ఉత్తరకొరియా న్యూక్లియర్ ఆయుధాల సంస్థకు హెడ్‌గా పనిచేసిన రీ హంగ్ సాప్, ఉత్తరకొరియా అధికార పీపుల్స్ వర్కర్ పార్టీ డిప్యూటీ డైరెక్టర్ హంగ్‌సంగ్ మూ లు ఈ ఫోటోలో ఉన్నారు.

హైడ్రోజన్ బాంబు కొరియాకు మరింత బలం

హైడ్రోజన్ బాంబు కొరియాకు మరింత బలం

ఉత్తర కొరియా ఆధునీకరించిన హైడ్రోజన్ బాంబు ద్వారా మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆ దేశ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్టుగా ఉ,కొరియా మీడియా ఇప్పటికే ప్రకటించింది. అయితే గత ఆదివారం నాడు హైడ్రోజన్ బాంబును పరీక్షించడంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి.హైడ్రోజన్ బాంబును తయారుచేసిన శాస్త్రవేత్తలను కిమ్ అభినందించారు.

69, వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన ఉ. కొరియా

69, వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన ఉ. కొరియా

శనివారం నాడు ఉత్తరకొరియా 69, వార్షికోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఉ. కొరియాకు చెందిన ప్రముఖులకు ప్రజలు నివాళులర్పించారని మీడియా ప్రకటించింది. రెండవ కిమ్ సంగ్, అతని కుమారుడు రెండవ కిమ్ జంగ్ సమాధుల వద్ద ప్రజలు నివాళులర్పించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా కళా ప్రదర్శనలు, ఆట పాటలతో ప్రజలు సందడి చేశారని మీడియా ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korean leader Kim Jong Un hosted a massive celebration to congratulate his nuclear scientists and technicians who steered the country’s sixth and largest nuclear test a week ago, its official news agency said on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి