హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చాటుమాటుగా: ప్రేమికులు బిక్కుబిక్కు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమికుల రోజు ప్రేయసీప్రియులకు శుక్రవారం నిరాశనే మిగిలించింది. భజరంగ్‌దళ్, హిందూవాహిని, శివసేన కార్యకర్తల హెచ్చరికలు చేయడంతో వేడుకలు సరదాగా గడిపేందుకు ప్రేమికులు భయపడి వెనకడుగు వేశారు. స్వేచ్ఛగా ప్రేమికుల రోజును ఆనందించలేకపోయారు.

సాధారణమైన రోజుల్లో కళకళలాడే పార్కులు ప్రేమికుల రోజు మాత్రం బోసిబోయాయి. ప్రేమికులకు కేరాఫ్‌గా మారిన ఇందిరా పార్క్, లుంబినీ పార్కు వంటి వాటిని మూసేశారు. కొంతమంది ప్రేమికులు శుక్రవారం సాయంత్రం వేడుకలు జరుపుకున్నారు.

పార్కులల్లో, పబ్లిక్ స్థలాల్లో ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్‌దళ్, శివసేన హెచ్చరికలు జారీ చేశాయి. దాంతో శుక్రవారం పార్కుల వద్దకు వచ్చేందుకు ప్రేమికులు సాహసించలేదు. లేనిపోని సమస్యలు ఎందుకని నిర్వాహకులు ముందుగానే పార్కులను మూసేశారు.

పార్కుల్లోకి అనుమతించకపోవడంతో ప్రేమికులు ఇతర మార్గాలు వెతుక్కున్నారు. సినిమా థియేటర్లు, కళాశాలల్లోనే వాలంటైన్స్ డే నిర్వహించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాలలో ప్రేమికులు స్వేచ్ఛగా తిరిగారు. ఐమాక్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సినిమా థియేటర్లలో సందడి చేశారు.

కొన్ని సంస్థలు ప్రేమికులను బెదిరిస్తుంటే మరోవైపు పోలీసులేమో ప్రేమికులకు రక్షణగా నిలిచారు. పార్కుల వద్ధ, థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు వెలవెలబోయిన పార్కులు ఆ తర్వాత ప్రేమ పక్షులతో కిటకిటలాడాయి. ఎన్టీఆర్ పార్కు, లుంబిని పార్కుల్లో ప్రేమికులు సందడి చేశారు.

కాస్తా ధైర్యం చేశారు..

కాస్తా ధైర్యం చేశారు..

ఈ ప్రేమికులు వాలెంటైన్స్ డే రోజున కాస్తా ధైర్యం చేసినట్లున్నారు. శుక్రవారం పార్కులు బోసిబోయి సినిమా థియేటర్లు కళకళలాడాయి.

ఫోటో తీస్తా...

ఫోటో తీస్తా...

ఒంటరి ప్రేమ జంట ఇలా కనిపించింది. తన ప్రేయసి ఫొటో తీయడానికి ఓ యువకుడు ప్రయత్నం చేస్తున్న దృశ్యం

కాస్తా చూసి..

కాస్తా చూసి..

హెచ్చరికలు చేసిన సంస్థల కార్యకర్తల నుంచి రక్షించుకోవడానికి కాస్తా జాగ్రత్తగా అడుగులు వేద్దామనుకుంటున్నట్లగా ఈ జంట ఇలా.. సాయంత్రానికి పార్కుల్లో కాస్తా సందడి కనిపించింది.

ఇలా గడిపేద్దామా..

ఇలా గడిపేద్దామా..

ప్రేమ పరీమళాలు వెదజల్లుకుంటూ ఇలా గడిపేద్దామా.. ప్రేమ ఒక్కటే మిగిలి అంతా అదృశ్యమై ఇలా తేలిపోదాం అన్నట్లుగా..

ఇలా రక్షణ ..

ఇలా రక్షణ ..

వివిధ సంస్థలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రేమికులకు రక్షణగా భద్రతా బలగాలు కాపు కాసినట్లే ఉన్నాయి.

ఇలా కలిసే సాగుదాం..

ఇలా కలిసే సాగుదాం..

ప్రేమికులు శుక్రవారంనాడు సినిమా థియేటర్లను, కళాశాలలను ఆశ్రయించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాస్తా సందడి కనిపించింది.

గులాబీ పువ్వే సాక్షిగా..

గులాబీ పువ్వే సాక్షిగా..

గులాబీ పువ్వు సాక్షిగా ప్రేమను వికసింపజేద్దాం, చేతిలో చేయి వేసి కలిసే సాగుదాం అన్నట్లుగా ఈ ప్రేమికుల జంట ఇలా.

నెక్లెస్ రోడ్డు ఖాళీ...

నెక్లెస్ రోడ్డు ఖాళీ...

ప్రతి రోజూ సందడిగా ఉండే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మీది నెక్లెస్ రోడ్డు ప్రేమికుల రోజు శుక్రవారం ఖాళీగా కనిపించింది.

ఇలా ముళ్లకంచెలు కూడా..

ఇలా ముళ్లకంచెలు కూడా..

ప్రేమికులపై భజరంగ్‌దళ్ తదితర సంస్థలు హెచ్చరికలు చేయడంతో పోలీసులు తగిన రక్షణ చర్యలు చేపట్టారు. నెక్లెస్ రోడ్డులో ఇలా ముళ్ల కంచె వేశారు.

సందడే లేదు..

సందడే లేదు..

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు సాధారణమైన రోజుల్లో ప్రేమ జంటలతో నిండిపోతుంది. శుక్రవారం మాత్రం బోసిపోయి కనిపించింది.

బోసిబోయిన సంజీవయ్య పార్కు

బోసిబోయిన సంజీవయ్య పార్కు

ప్రేమికుల రోజున హైదరాబాదులోని సంజీవయ్య పార్కు పూర్తిగా బోసిబోయింది. ప్రేమికులు శుక్రవారంనాడు పార్కులకు దూరంగా ఉన్నారు.

సరూర్ నగర్ కట్ట మీద..

సరూర్ నగర్ కట్ట మీద..

హైదరాబాదులోని సరూర్ నగర్ కట్ట కూడా అందంగా ముస్తాబైంది. ఈ కట్టపై ఓ ప్రేమికుల జంట ఇలా అడుగులో అడుగులు వేసుకుంటూ..

చాటుమాటుగా...

చాటుమాటుగా...

ప్రేమికుల రోజు ఓ జంట ఇలా చాటుమాటుగా తమ ప్రేమకబుర్లకు తెర తీసింది. ప్రియదర్శిని పార్కులో సెలయేరు పక్కన హాయిగా సేద దీరుతూ..

English summary
with the warnings of Bhajarandal and other organisations lovers feared of to roam freely in Hyderabad and they kept away from parks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X