మరో షాక్: పాక్‍‌ను దెబ్బతీసేందుకు మోడీ మరో వ్యూహం!

న్యూఢిల్లీ: యూరి దాడి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే పలు అంశాల పైన చర్చించింది. ఉగ్రవాదం విషయంలో పాక్‌ను ఏకాకి చేసింది. ఐరాసలో దానికి షాకిచ్చింది. సార్క్ సమావేశాల విషయంలోను పాక్‌కు ఎదురు దెబ్బ తగిలింది.

భారత్‌కు వ్యతిరేకంగా.. మసూద్‌పై చైనా ప్రేమ, అణుపై పాక్‌కు అమెరికా హెచ్చరికఆ తర్వాత సర్జికల్ స్ట్రయిక్ ద్వారా పాక్‌కు తిరుగులేని షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత సింధు జలాల పైన ఆలోచన చేస్తోంది. అదే సమయంలో పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే సర్వసన్నద్ధంగా ఉన్న భారత్ ఇప్పుడు పాక్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది.

ఆ దేశంతో వాణిజ్య బంధాలను తెంచేసుకోవాలని భావిస్తోంది. నిజానికి భారత్ కంటే పాకిస్థాన్ అయిదు రెట్లు చిన్నది. ఆర్థిక వ్యవస్థలో మనకంటే ఏడు రెట్లు తక్కువ. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టడం ద్వారా పాక్‌ను మూడుచెరువుల నీళ్లు తాగించాలనేది ప్రధాని మోడీ వ్యూహంగా కనిపిస్తోంది.

 PM Narendra Modi

స్వీయ రక్షణ కోసం తాపత్రయ పడడం స్వీయ అపరాధమే అవుతుందన్న విధానంతో మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఓ భద్రతాధికారి పేర్కొన్నారు. భారత్-పాక్ మధ్య రూ.17.31 కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది. అనధికారికంగా ఇది రూ.33 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

మన దేశం నుంచి దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు నగలు, టెక్స్‌టైల్స్, యంత్రాలు వంటివి ఎగుమతి అవుతున్నాయి. అదే మార్గంలో పాక్ నుంచి భారత్‌కు వస్త్రాలు, డ్రైఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, సిమెంట్ దిగుమతి అవుతున్నాయి.

మూడో దేశం ద్వారా పాక్‌తో చేస్తున్న ఇలాంటి వాణిజ్యానికి స్వస్తి చెప్పడం ద్వారా ఆ దేశంపై తీవ్ర ఒత్తడి పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. పాక్‌తో బలమైన సంబంధాలు ఉన్న యూఏఈ వంటి దేశాలను సైతం భారత్ వ్యూహం పునరాలోచనలో పడేస్తుందంటున్నారు. దీంతో పాక్ కుదేలవుతుందంటున్నారు.

ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే పాక్ విలవిల్లాడుతుందంటున్నారు. దౌత్యపరంగా ఇప్పటికే ఏకాకి అయిన పాక్‌ను ఆర్థికంగానూ నష్టపరచడం ద్వారా తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుందని అంటున్నారు. కాబట్టి వాణిజ్య సంబంధాలను కట్ చేసుకోవడానికే ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మోడీ తాజా పరిస్థితులను వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+