Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌కు వ్యతిరేకంగా.. మసూద్‌పై చైనా ప్రేమ, అణుపై పాక్‌కు అమెరికా హెచ్చరిక

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌ దాడుల సూత్రధారి, పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్‌ సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ను తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్య రాజ్య సమితిలో భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డు తగులుతోంది. ఇందుకు సంబంధించిన తీర్మానానికి ఆమోదం తెలపకుండా సాంకేతికంగా వాయిదా వేస్తోంది.

ఈ వాయిదా గడువు సోమవారంతో ముగియనుంది. దానిని మరో మూడు నెలలపాటు పొడిగించింది. గత మార్చిలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి 1267వ కమిటీ (ఐక్యరాజ్య సమితి ఆమోదాల సంఘం)కి భారతదేశం ఇచ్చిన దరఖాస్తుపై సాంకేతిక వాయిదాను పొడిగిస్తూ ఇది వరకే నిర్ణయం తీసుకున్నామని చైనా విదేశంగా శాఖ ప్రతినిధి గెంగ్‌ శనివారం తెలిపారు.

భారత్‌ సమర్పించిన దరఖాస్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నందున చర్చలకు మరికొంత సమయం అవసరమన్నారు. భద్రతా మండలిలో పదిహేను మంది సభ్యులు ఉండగా, పద్నాలుగు మంది భారత్‌ తీర్మానానికి మద్దతు తెలిపారు.

China

గత మార్చి 31న ఈ తీర్మానం ఓటింగ్‌కు రాగా, దానిని శాశ్వత సభ్యురాలైన చైనా తన వీటో అధికారంతో అడ్డుకొంది. గోవాలో అక్టోబరు 15, 16 తేదీల్లో జరిగే బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధ్యానం సంతరించుకొంది.

గత ఏడాది జూన్‌లో కూడా 2008 ముంబై అల్లర్ల సూత్రధారి లష్కరే తొయిబా కమాండర్‌ జకీ ఉర్ లక్వీ పన చర్యలు తీసుకోకుండా కూడా చైనా అడ్డుకొంది.

పాకిస్తాన్‌లో భారత చానళ్ల నిషేధం

పాకిస్థాన్‌లో ప్రసారమవుతున్న భారత టెలివిజన్‌ ఛానల్స్‌ను ఈ నెల 15నుంచి నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అణు బెదిరింపులపై పాక్‌కు అమెరికా హెచ్చరిక

భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించడానికి వెనుకాడబోమని పాక్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. బెదిరింపులకు పాల్పడొద్దని, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన బాధ్యతాయుత దేశంగా ప్రవర్తించాలని హితవు పలికింది.

తమ పైన యుద్ధం ప్రకటిస్తే భారత్‌ను ధ్వంసం చేస్తామని, మేం అణు బాంబులు తయారు చేసింది అద్దాల పెట్టెల్లో పెట్టుకొని చూసుకునేందుకు కాదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మార్క్‌ టోనర్‌ మాట్లాడారు.

ఇవి చాలా ఆందోళన కలిగించే వ్యాఖ్యలు అని, అణు సంబంధిత అంశాలపై ఇప్పటికే పాక్‌ను చాలాసార్లు హెచ్చరించామని, అణ్వాయుధాల భద్రతపై మేం ఎప్పుడూ ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నామని, పరిస్థితులను దగ్గరుండి జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అన్నారు. అలాగే, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హక్కానీ నెట్‌వర్క్‌, జైషే మహమ్మద్‌ (జేఈఎం) లాంటి ముష్కర సంస్థలను పూర్తిగా నిషేధించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+