నగరంలో వర్ష బీభత్సం: జనం పాట్లు(పిక్చర్స్)

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ప్రవేశించటంతో నగరంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.

దాదాపు గంట సేపు కురిసిన వర్షానికి నగరంలోని అమీర్‌పేట మైత్రివనం, సంజీవరెడ్డినగర్ చౌరస్తా, లక్డీకాపూల్, రాణిగంజ్, పంజాగుట్ట, ప్రకాశ్‌నగర్, సచివాలయం, ఏసిగార్డ్స్, కాచిగూడ, ఆబిడ్స్, విద్యానగర్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిలిచింది.

ఫలితంగా ఆ కూడళ్లలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించింది. వర్షాకాలం కష్టాలను నివారించేందుకు ఈ సారి 81 అత్యవసర బృందాలు, రౌండ్ ది క్లాక్ పనిచేసేలా తగిన చర్యలు తీసుకుంటామని మహానగర పాలక సంస్థ కమిషనర్ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే నగరాన్ని వర్షం తడిసి ముద్ద చేసింది.

భారీ వర్షం

భారీ వర్షం

నైరుతి రుతుపవనాలు ప్రవేశించటంతో నగరంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం

భారీ వర్షం

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం

భారీ వర్షం

కురిసిన భారీ వర్షానికి నగరంలోని అమీర్‌పేట మైత్రివనం, లక్డీకాపూల్, రాణిగంజ్, పంజాగుట్ట, ప్రకాశ్‌నగర్, సచివాలయం, కాచిగూడ, ఆబిడ్స్, విద్యానగర్, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిలిచింది.

భారీ వర్షం

భారీ వర్షం

ఫలితంగా ఆ కూడళ్లలో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించింది.

భారీ వర్షం

భారీ వర్షం

వర్షాకాలం కష్టాలను నివారించేందుకు ఈ సారి 81 అత్యవసర బృందాలు, రౌండ్ ది క్లాక్ పనిచేసేలా తగిన చర్యలు తీసుకుంటామని మహానగర పాలక సంస్థ కమిషనర్ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే నగరాన్ని వర్షం తడిసి ముద్ద చేసింది.

భారీ వర్షం

భారీ వర్షం

ఎక్కువ మోతాదులో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై దృష్టి సారించి, మోటార్ల సహాయంతో వాటిని వీలైనంత త్వరగా తోడేయాలంటూ ఆయన జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినా.. శుక్రవారం సాయంత్రం వర్షం కురుస్తున్నపుడు, ఆగిన తర్వాత ఎక్కడా సహాయక చర్యలు చేపట్టి దాఖలాల్లేవు.

భారీ వర్షం

భారీ వర్షం

వర్షం కారణంగా పార్శిగుట్ట ప్రాంతంలో పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి.

భారీ వర్షం

భారీ వర్షం

సికింద్రాబాద్ స్టేషన్‌కు సమీపంలో డ్రైనేజీలో బస్సు కూరుకుపోయింది. గ్రేటర్‌లో శుక్రవారం 2.3సెం.మీల వర్షపాతం నమోదైనట్లు తెలిసింది.

వరదనీరు

వరదనీరు

శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ప్రాంతాలతో పాటు కోర్ సిటీలోని మరికొన్ని ప్రాంతాల్లో ఫెక్సిలు, బ్యానర్లు గాలి దాటికి తట్టుకోలేక చిరిగిపోయాయి. ఉప్పల్‌లో వడగండ్ల వానకు బలమైన గాలులు వీచాయి.

భారీ వర్షం

భారీ వర్షం

ఎల్బీనగర్ ప్రాంతంలో వర్షపునీటిలో కార్లు కొట్టుకుపోయాయి. కోర్ సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో దాదాపు గంట సేపు ఓ మోసార్తు వర్షం కురిసింది.

భారీ వర్షం

భారీ వర్షం

ఆఫీసు సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం కురవటంతో నిత్యం రద్ధీగా ఉండే పలు కూడళ్లు, ట్రాఫిక్ జంక్షన్లలో ట్రాఫిక్‌లో చిక్కుకుని వాహనాలు కిలోమీటరు పొడువున నిలిచిపోయాయి.

భారీ వర్షం

భారీ వర్షం


లక్షలాది వాహనాల రాకపోకలతో కిటకిటలాడే లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది.

వర్షం కారణంగా పార్శిగుట్ట ప్రాంతంలో ఇళ్లల్లోకి నీళ్ళు చేరుకున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌కు సమీపంలో డ్రైనేజీలో బస్సు కూరుకుపోయింది. గ్రేటర్‌లో శుక్రవారం 2.3సెం.మీల వర్షపాతం నమోదైనట్లు తెలిసింది.

శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ప్రాంతాలతో పాటు కోర్ సిటీలోని మరికొన్ని ప్రాంతాల్లో ఫెక్సిలు, బ్యానర్లు గాలి దాటికి తట్టుకోలేక చిరిగిపోయాయి. ఉప్పల్‌లో వడగండ్ల వానకు బలమైన గాలులు వీచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+