అరుదైన దృశ్యం: కరీంనగర్‌లో టోర్నడో కలకలం(వీడియో)

Subscribe to Oneindia Telugu

కరీంనగర్: నగరంలోని దిగువ మానేరు జలాశయం(ఎల్ఎండీ)లో శుక్రవారం సాయంత్రం అరుదైన దృశ్యం కనువిందు చేసింది. అంతేగాక, అక్కడున్న వారిలో కలకలం కూడా సృష్టించింది.

తరచూ అమెరికా ఖండంలోని దేశాల్లో వచ్చే టోర్నడో(భారీ సుడి గాలి) మాదిరిగా దిగువ మానేరు జలాశయంలో పెద్ద నీటి సుడి ఏర్పడింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకోగా, నీటిసుడి పైకి తిరుగుతూ మేఘాలను తాకింది. ఈ అరుదైన దృశ్యం ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సముద్రాలు, నదుల్లో కనిపించే ఈ అరుదైన దృశ్యం కేవలం 2.47 టీఎంసీల నీరున్న దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ)లో ఏర్పడటంతో నగరవాసులు వింతగా చూశారు. కొందరు పెద్ద టోర్నడోగా భావించి అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, దాదాపు అరగంటపాటు డ్యాంలోని నీరు ఇలా టోర్నడోల రూపంలో పైకి లేచింది.

టోర్నడో

టోర్నడో

కరీంనగర్ నగరంలోని దిగువ మానేరు జలాశయం(ఎల్ఎండీ)లో శుక్రవారం సాయంత్రం అరుదైన దృశ్యం కనువిందు చేసింది. అంతేగాక, అక్కడున్న వారిలో కలకలం కూడా సృష్టించింది.

టోర్నడో

టోర్నడో

తరచూ అమెరికా ఖండంలోని దేశాల్లో వచ్చే టోర్నడో(భారీ సుడి గాలి) మాదిరిగా దిగువ మానేరు జలాశయంలో పెద్ద నీటి సుడి ఏర్పడింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకోగా, నీటిసుడి పైకి తిరుగుతూ మేఘాలను తాకింది.

టోర్నడో

టోర్నడో

సముద్రాలు, నదుల్లో కనిపించే ఈ అరుదైన దృశ్యం కేవలం 2.47 టీఎంసీల నీరున్న దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ)లో ఏర్పడటంతో నగరవాసులు వింతగా చూశారు.

టోర్నడో

టోర్నడో

కొందరు పెద్ద టోర్నడోగా భావించి అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, దాదాపు అరగంటపాటు డ్యాంలోని నీరు ఇలా టోర్నడోల రూపంలో పైకి లేచింది. ఈ అరుదైన దృశ్యం ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tornado in Karimnagar LMD.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి