కృష్ణా పుష్కరాలకు అంతా సిద్ధం, 'కళ్లు చెదిరే' షాక్

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ నుంచి అతి భారీ వాహనాలు వెళ్లే మార్గాలను జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఖరారు చేసింది.

సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు రేంజ్‌ డీఐజీ రామకృష్ణ వివరాలు వెల్లడించారు.

మంగళవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్దేశించిన మార్గాల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు. ఆయా మార్గాల్లో ఉండే అధికారులను ఇందుకు సమాయత్తం చేశామన్నారు.

కృష్ణా పుష్కరాలకు గవర్నర్ నరసింహన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నాడు ఆహ్వానించారు. రాజ్ భవన్లో ఆయన గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

కాగా, ఏపీలో పుష్కరాల సందర్భంగా భారీ వెలుగులు, జిలుగులు అంటూ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే, ఆ ఫోటోలు అసలు ప్రకాశం బ్యారేజీవి కావని తేలింది. సౌత్ కొరియాలోని బ్రిడ్జివి అని తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+