హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంజీవయ్య పార్కులోని యాచ్ క్లబ్‌లోని ఆదివారం కాయకథన్ పడవ పోటీలు జరిగాయి. హుస్సేన్‌సాగర్ యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెయిలింగ్ పోటీలు ఉత్సాహంగా నిలిచాయి. దియాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు.

అండర్-14, ఓపెన్ ఉమెన్స్ విభాగాల్లో ఈ పోటీల్లో సుమారు 70 మంది పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని నేషనల్ సెయిలింగ్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు యాచ్ క్లబ్ అధ్యక్షుడు సుహీంషేక్ తెలిపారు. చారిత్రక హుస్సేన్ సాగర్‌ ప్రక్షాళనతో పాటు సంజీవయ్య పార్కులో మరో మూడు నూతన వనాలను తీర్చిదిద్దనున్నట్లు హెచ్‌డీఎంసీ కమిషనర్ చిరంజీవులు తెలిపారు.

 సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

హుస్సేన్ సాగర్ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రక్షాళన చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా సాగర్ జలాల్లో కలుస్తున్న కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

మరోవైపు సంజీవయ్య పార్కులో నూతనంగా నాలుగు ఉద్యానవనాలను తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ సాగర్ ప్రక్షాళన అనంతరం ట్యాంక్ బండ్ చుట్టూ సుగంధ ద్రవ్యాల మొక్కలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

సాగర్ పరిసరాల్లో ఏటా ఆయా కార్యక్రమాలు నిర్వహించుకునేలా క్యాలెండర్‌ను ఉదాగి సందర్భంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ పోటీలు

రానున్న బతుకమ్మ సంబరాలను సాగర్ చుట్టూ నిర్వహించుకునేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా కాయకథన్‌లో భాగంగా పడవ పోటీలను బాలరు, బాలికలు, పరుషులు, కుటుంబీకులు ఇలా నాలుగు కేటగిరీల్లో నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

English summary
"Yacht Club and Telangana Tourism" held at Yacht Club, Sanjeevaiah Park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X