యూత్ స్పెషల్ : అది అతనికో మిషన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అతను ప్రణయ్ రాజ్ వంగరి. థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఫిల్ చేస్తున్నప్పుడు పరిశోధనలో భాగంగా తెలుగు నాటక రంగంపై సమాచారం కోసం తెలుగు వికీపీడియాలో అన్వేషించడం ప్రారంభించాడు. అయితే, అతనికి సంతృప్తికరమైన సమాచారం లభించలేదు.

అన్ని భాషల వికీపిడియాలో కన్నా తెలుగు వికీపిడియాలో తక్కువ సమాచారం ఉందని గుర్తించాడు. దాంతో అతని కృషి మరో వైపు మలుపు తిరిగింది. తాను పడిన శ్రమ అందరూ పడకూడదని భావించాడు. అంతే తెలుగు వికీపిడీయాలో పూర్తి సమాచారం ఉండేలా చూడాలని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా 2013 మార్చి 8వ తేదీన వికీపిడియాలో లాగిన్ అయి వివిధ అంశాలకు సంబంధించిన వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. తెలంగాణకు సంబంధించిన సమాచారం మరీ తక్కువగా ఉందని అతను అభిప్రాయపడ్డాడు. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ సూచన మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖుల గురిచి తెలుగు వికీపిడియాలో వ్యాసాలు రాసే ప్రయత్నంలో ఉన్నాడు.

Youth special: Telugu Wikipedia man Pranay

అతనికి ఇటలీలో జరిగే వికీపిడియా అంతర్జాతీయ సదస్సులో పాల్గోవాల్సిందిగా ఆహ్వానం అందింది. వికీమేనియా 2016 పేరుతో ఆ సదస్సు జూన్ 22 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. అయితే తాను వ్యాసాలు రాస్తూనే వికీపిడియా శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు. తెలుగు వికీపిడియా గురించి వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కూడా సాగిస్తున్నాడు. దాంతో గత మూడేళ్లుగా ఆయనకు వికీపిడియా అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానం అందుతోంది.

తెలుగు వికీపిడియా గురించి తెలుగువాళ్లందరికీ తెలియడం కోసం ప్రతి రోజూ, ఆరోజుకు సంబంధించి గతంలో జరిగిన సంఘటనలనను, ప్రముఖుల జననమరణాల గురించిన సమాచారాన్ని చరిత్రలో ఈ రోజు పేరుతో ఫేస్‌బుక్‌లో సమాచారం అప్‌డేట్ చేస్తున్నాడు. తాను తెలుగు వికీపిడియా పదో, పదకొండో వార్షికోత్సవాలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు కూడా.

వివిధ భాషల వికీపిడియాల్లో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకోవడానికి, తెలుగు వికీ పిడియా చేస్తున్న కార్యక్రమాలను ఇతర భాషల వికీ పిడియన్లకు వివరించడానికి ఇటలీ సదస్సు ఉపయోగపడుతుందని ప్రణయ్ రాజ్ వంగరి అంటున్నాడు.

ప్రేమలేఖ కోసం క్లిక్ చేయండి

లవ్ స్టోరీ కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pranay Raj Vangari is developing Telugu Wikipedia. He is gong to praticipate in Italy convention.
Please Wait while comments are loading...