నందమూరి హీరోల ప్లాన్?

తనకు జరిగిన అవమానాన్ని తట్టులేకనే తారకరత్న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా బాలకృష్ణ పేరు చెబుతూ ఆయన ప్రసంగాలు చేశారు. ఆయన సమావేశాలకు పెద్ద యెత్తనే ప్రజలు వచ్చారు. దీంతో తదుపరి సమావేశానికి ఆయనను ఆహ్వానించి బుజ్జగించారు. దీంతో నందమూరి హీరోల కోటరీ ఒకటి తయారైంది. ఆ తర్వాత కూడా తారకరత్న సభల్లో పాల్గొన్నారు. ఈ సభల సందర్బంగా కాబోయే ముఖ్యమంత్రి బాలకృష్ణ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. బాలయ్య ముఖ్యమంత్రి అవుతారని తారకరత్న ప్రకటించారు. అభిమానులు బాలకృష్ణను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని కళ్యాణ్ రామ్ అన్నారు. వీరి ప్రకటనలపై బాబాయ్ బాలయ్యగానీ, నాన్న హరికృష్ణ గానీ ఏ మాత్రం స్పందించలేదు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా, బాలకృష్ణకు అనుకూలంగా ఏదైనా పథకం రచించి అమలు చేస్తున్నారా అనే అనుమానాలు బయలుదేరాయి.
ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు కాస్తా దూరంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన పూర్తిగా షూటింగులో మునిగిపోయారు. దీంతో వచ్చే నెల 5వ తేదీన గుంటూరులో జరిగే యువగర్జన సదస్సుకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవచ్చుననే ఊహాగానాలు మొదలయ్యాయి. అటు తారకరత్న ప్రకటనలు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఊహాగానాలు తెలుగుదేశం పార్టీ నేతలను కలవర పెట్టాయి. ఈ స్థితిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓ ప్రకటన చేశారు. తారకరత్న ప్రకటనలో తప్పు లేదని, బాలయ్య ఇప్పుడే ముఖ్యమంత్రి అవుతారని తారకరత్న ఉద్దేశం కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ యువగర్జన సదస్సుకు హాజరవుతారని కూడా ఆయన చెప్పారు.
నందమూరి హీరోల వ్యవహారం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందోననే భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సర్దుబాటు చేసే ప్రయత్నాలకు పూనుకున్నట్లు సమాచారం. యువగర్జన సదస్సులో నందమూరి ఏ విధమైన ప్రకటనలు చేస్తారోననే భయం కూడా ఉంది. అందుకే తెలుగుదేశం నేతలు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications