చంద్రబాబు కాల్ సెంటర్

ఈ కాల్ సెంటరును పార్టీ కార్యాలయంలోని గ్రంధాలయం హాలులో ఏర్పాటు చేశారు. ఇందులో 400 మందిదాకా పని చేస్తున్నారు. నెలకు 6 వేల రూపాయల జీతం మీద చంద్రబాబు వారిని నియమించినట్లు సమాచారం. ఈ కాల్ సెంటరులో 350 దాకా ఫోనులున్నాయి. దీన్ని నారాయణ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ అధినేత నారాయణ పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టరీ నుంచి ఏవో నెంబర్లను తీసుకుని ఫోన్ చేస్తుంటారు. ప్రశ్నలు వేస్తారు. దాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేస్తారు. ఓటర్లను అడగాల్సిన ప్రశ్నలను తెలుగుదేశం పార్టీ రూపొందించి ఆ ఉద్యోగులకు ఇచ్చిందని సమాచారం. తాము ఓటర్ల నాడిని తెలుసుకోవడానికి మాత్రమే కాల్ సెంటర్ పెట్టామని తెలుగుదేశం నాయకులంటున్నారు.












Click it and Unblock the Notifications