చిరు 'కుల' ఎజెండా

Chiranjeevi
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సామాజిక న్యాయ సాధన గోలనే రాజకీయాల్లో వైఫల్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుల ప్రాతిపదికపై సామాజిక న్యాయాన్ని సాధించాలనే రాజకీయ సూత్రీకరణను అమలు పెట్టడంలో ఆయన విఫలమయ్యారని అంటారు. సైద్ధాంతికంగా అది బాగానే కనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అది ఫలితాలు సాధించడంలో పనికి రావడం లేదని చెబుతారు. అయితే దాన్ని సృజనాత్మకంగా అన్వయించి ఆచరణలో పెట్టే స్థాయి ఆ పార్టీలో ఎవరికీ లేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. రెడ్లు, కమ్మల తర్వాత రాజ్యాధికారం రాష్ట్రంలో కాపులదేనని తుర్లపాటి వంటి సోషలిస్టులు సూత్రీకరించారు. ఆ సూత్రీకరణపై విశ్వాసంతో చిరంజీవిని కొంత మంది పెద్దలు రాజకీయాల్లోకి దింపారు. అయితే దాన్ని ఆచరణలో పెట్టడంలో మాత్రం వారు బౌద్ధిక స్థాయి సరిపోలేదు. పైగా, నారగోని లాంటి మేధావులు దానికి బాసటగా ఉన్నారు. నారగోని, జె. గౌతం లాంటి ప్రత్యామ్నాయ రాజకీయ బోధకులు పార్లమెంటరీ రాజకీయాలకు సరిపోరనే విషయాన్ని చిరంజీవి గానీ ఆయనను నడిపిస్తున్న అల్లు అరవింద్ కు గానీ అర్థమైనట్లు లేదు.

సినీ నటుడిగా ఎన లేని ఇమేజ్ ఉన్న చిరంజీవి రాజకీయాల్లో చతికిలపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీకి దిగలేని బలహీనమైన స్థితిలో ప్రజారాజ్యం ఉంది. కులాల సూత్రీకరణను సృజనాత్మకంగా అన్వయించకపోవడం వల్లనే ఈ దుస్థితి సంభవించిందని అంటారు. పేర్ల వెనక రెడ్డి, రావు వంటి పేర్ల ద్వారా ఆ కులాలకు చెందిన అందరినీ దూరం చేసుకోవడం తగదనే విషయం చిరంజీవి గమనించలేదు. దళితీరకణను, బహుజన తత్వాన్ని అంగీకరించే అగ్ర కులాలను కూడా దూరం చేసుకునే ఎత్తుగడల వల్ల ఈ ఉద్యమాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. పైగా, సామాజిక న్యాయ ఎజెండాను ముందుకు తెచ్చిన నారగోని లాంటి బిసి మేధావులు దళితులకు తమ ఎజెండాలో స్థానం కల్పించలేకపోయారు. దళితులను దూరం చేసుకునే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మాత్రమే వారు అనుసరిస్తున్నారు. దాని వల్ల చిరంజీవికి దళితులు రాజకీయంగా దగ్గర కాలేకపోయారు.

ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెసుకు దగ్గర కావడానికి కూడా కుల ప్రాతిపదికనే కారణమని అంటున్నారు. కోస్తా ప్రాంతంలో కాపులకు, కమ్మలకు నిత్య వైరం. ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేయడమనేది కుదరదు. కాంగ్రెసులో రెడ్డి నాయకత్వం ప్రస్తుతం లేదు. రోశయ్య నాయకత్వం కొనసాగుతోంది. ఈ రెండు కారణాల వల్ల చిరంజీవి కాంగ్రెసుకు దగ్గర కావడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్క సీటు లేనప్పుడు కూడా లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ స్వతంత్రంగా వ్యవహరించారు. చిరంజీవి అలా స్వతంత్రంగా నిలబడి పార్టీని బలోపేతం చేసే ఎజెండాను స్వీకరించి ముందుకు సాగడంలో విఫలమవుతున్నారు. దీనివల్లనే ప్రజారాజ్యం పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతోందనే విశ్లేషణ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+