వెంకయ్యకు కలిసొస్తుందా?

కలిసికట్టుగా పని చేసి పార్టీని పద్ధతిలో పెట్టాలని ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో బిజెపిలో పలు సంస్థాగత మార్పులు చోటు చేసుకోవచ్చునని చెబుతున్నారు నాయకత్వమార్పుపై, వారసత్వ ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి బిజెపి నాయకులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్, వెంకయ్యనాయుడు భగవత్ ను కలిశారు. ఆ తర్వాత ఎల్ కె అద్వానీని ఆయన నివాసంలో కలిశారు.
కాందహార్ విషయంలోనూ, వోటుకు నోటు వ్యవహారంలోనూ అద్వానీపై ఎడతెగని విమర్శలు వస్తున్నాయి. పార్టీ అసమ్మతి నేతలు అద్వానీపై గురి పెట్టి విమర్శలు చేస్తున్నారు. బహిష్కృత నేత జస్వంత్ సింగ్ మాత్రమే కాకుండా అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలతో పాటు పలువురు విమర్శానాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ వారసత్వ ఎంపిక గురించే భగవత్ తనను కలిసిన బిజెపి నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తమ భేటీకి ప్రాధాన్యం లేదని వెంకయ్యనాయుడు చెప్పినప్పటికీ మార్పుల కోసమే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అద్వానీతో పాటు రాజ్ నాథ్ సింగ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు బలంగానే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో వెంకయ్యనాయుడు కలిసి రావచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications