బాబుకు ఆగస్టు ఫోబియా

చంద్రబాబు ఉద్దేశ్యాన్ని పక్కకు పెట్టి వారు మంగళవారంనాటి సమావేశంలో చాలా ముందుకు వెళ్లారు. శ్రీకృష్ణ కమిటికీ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇస్తే తప్ప ప్రజలు విశ్వసించబోరనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. అందుకు చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని కూడా కొంత మంది నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ప్రత్యేకంగా పార్టీ కమిటీ వేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, చంద్రబాబు అందుకు అంగీకరిస్తారా అనేది సందేహమే. సీమాంధ్ర నాయకులను కాదని చంద్రబాబు తెలంగాణ విషయంలో ఏ మాత్రం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అలా వెళ్లడం ఎన్టీ రామారావు కుమారుడు, సినీ నటుడు బాలకృష్ణకు గానీ, మరో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు గానీ ఇష్టం లేదు. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరుతో సమైక్యాంధ్రనే వారు కోరుకుంటున్నారు. ఒకవేళ తెలంగాణ నాయకుల ఒత్తిడికి తలొగ్గితే చంద్రబాబును బాలకృష్ణ రూపంలో సంక్షోభం ముంచెత్తే ప్రమాదం లేకపోలేదు. బాలకృష్ణ వెనక్కి తగ్గినా హరికృష్ణ వెనక్కి తగ్గకపోవచ్చు.
ఇప్పటికే బాలకృష్ణకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ సీమాంధ్ర నాయకుల నుంచి వస్తోంది. ఈ స్థితిలో చంద్రబాబుకు గండం అన్ని వైపుల నుంచి గండం పొంచే ఉందని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ముందుకు రాకపోతే తమ మనుగడ పూర్తిగా ప్రమాదంలో పడ వచ్చుననే ఆందోళన తెలంగాణ నేతల్లో వ్యక్తమవుతుంది. చంద్రబాబు తమ మాట వినకపోతే ఏం చేయాలనే ఆలోచన కూడా వారు చేసే అవకాశం లేకపోలేదు. ఏమైనా, ఆగస్టు సంక్షోభం చంద్రబాబును ఏ తీరాలకు నెడుతుందనే ఇప్పుడే చెప్పలేం.












Click it and Unblock the Notifications