ఎన్నికలు వస్తాయా...

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణం నెలకొంది. ఎప్పుడూ లేనట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు జనాల్లోకి వెళుతున్నాయి. ఎన్నికలు అయిపోయి పూర్తిగా సంవత్సరంన్నర కాలేదు.మరి ఇలాంటప్పుడు పార్టీలు జనాల్లోకి వెళ్లడమేంటి, ఎన్నికల అనంతరం ఈ సమాయానికి ఏ పార్టీలు ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. కాని ఇప్పుడు విచిత్రంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యడు జగన్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెరాస అధినేత కెసిఆర్, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ లు ప్రజల్లోకి వెళ్లుతున్నారు. ఇప్పటికే ఓదార్పు పేరుతో జగన్, సమస్యల పేరుతో చంద్రబాబు, చిరంజీవి, పల్లేబాట పేరుతో కిషన్ రెడ్డిలు ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికలయి కొన్ని రోజులే అయినప్పటికీ వారు ప్రజల్లోకి వెళ్లడానికి గల కారణాలు రెండు. ఒకటి తెలంగాణ, రెండు జగన్.

కాంగ్రెసు కున్న 156 ఆధిక్యంలో సుమారు జగన్ వర్గం ఎమ్మెల్యేలు 50 మందికి పైగా ఉన్నారు. కొందరు బాహాటంగానే జగన్ కు మద్దతు పలుకుతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చెయ్యాలని వైఎస్ మృతదేహాన్ని ఖననం చేస్తున్నప్పుడే ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. ఇప్పుడు కొందరు జగన్ వర్గంనుండి తప్పుకున్నప్పటికీ, మిగిలిన వాళ్లు రోశయ్యని దించి జగన్ను ముఖ్యమంత్రిగా చెయ్యడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. వారు మంచి సమయం కోసం వేచి చూస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినట్టు సమాచారం. జగన్ కున్న ప్రజాబలం చూసుకొని తదుపరి ప్రయత్నాలు చెయ్యాలని వారి ఆలోచనగా ఉంది. దీంతో వారు ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా మారి ప్రభుత్వం పడిపోతుందోనని అందరిలోనూ ఉంది.

ఇక గత డిసెంబర్ నుండి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి తెలంగాణవాదులు జీర్ణించుకోలేక పోతున్నరు. తెరాస ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రజల్లో ఉన్న తెలంగాణ భావం ఉవ్వెత్తున ఎగిసి ఈ సమయంలో తెలంగాణకు అనుకూలంగా లేకపోతే తెలంగాణలో తమ పార్టీలు కనిపించకుండా పోవటం ఖాయమన్న భావన ఆయా పార్టీల్లో నెలకొంది. అందుకే తెలంగాణకు తాము అనుకూలమంటూ తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ ప్రరాప, తెలంగాణ తెలుగు దేశమంటూ కొత్తగా తెరపైకి వచ్చాయి. ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణకు మొదటినుండి అనుకూలమే. తెలంగాణ కాంగ్రెసు, తెదేపాలు తమ పార్టీ అధిష్టానం నిర్దిష్ట వైఖరి చెప్పనప్పటికీ తాము తెలంగాణకు అనుకూలమేనంటూ ప్రకటలను గుప్పిస్తున్నారు. లోక్ సత్తా, ప్రరాప తెలంగాణ నాయకులు తమ అధినేతలు తెలంగాణకు అనుకూలమైతేనే వారిని సమర్థిస్తామని నిక్కచ్చిగా చెబుతున్నారు. ఇలా తెలంగాణలో తమ పార్టీని నిలబెట్టుకొనడానికి వారు ప్రజల్లోకి వెళుతున్నరు.

ఎందుకంటే తెరాస అధినేత కెసిఆర్ డిసెంబర్ 31 తరువాత తెలంగాణ ప్రకటించకుంటే అంతర్యుద్దం ప్రారంభమవుతుందంటున్నారు. అతనికి సపోర్టుగానన్నట్టు అన్ని పార్టీలు ఆ రాగాన్నే అందుకుంటున్నాయి. అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్న జగన్, తెలంగాణ సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయి ఎన్నికలు రావచ్చుననే ఆలోచన దృష్ట్యా పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+