జగన్ తిరుగుబాటు షురూ?

ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి నివాసంలో జగన్ తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులతో భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు కొండా సురేఖ, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేష్, రామచంద్రారెడ్డి, అబ్బి వెంకటస్వామి, గుర్నాథ్ రెడ్డి, రాజేష్, నాని, రాజ అశోక్, తోట నరసింహం, వరప్రసాద్ తదితర శాసనసభ్యులు పాల్గొన్నారు. వారంతా అక్కడి నుంచి ముగింపు సభకు బయలుదేరారు.
ముందు అనుకున్నట్లుగానే శాసనసభ్యులు జగన్ ముగింపు సభకు తరలి వచ్చారు. ఇక తిరుగుబాటు తప్పదని భావించిన జగన్ వర్గం శాసనసభ్యులు, నాయకులు దండిగా సమీకరణ చేసి తమ సత్తా చాటుతున్నారు. తాను జగన్ వెంటనే ఉంటానని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రకటించారు. పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా జగన్ కు మద్దతిస్తున్నారు. మొత్తం మీద, జగన్ జంగ్ షురూ అయినట్లే.












Click it and Unblock the Notifications