తెలంగాణా.. బాబోయ్!: చేతులెత్తేసిన ఆజాద్

ఆజాద్ కన్నా ముందు ఉన్న వీరప్ప మొయిలీ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించడంలో విఫలమయ్యాడనే ఉద్దేశ్యంతో కేంద్రం ఆజాద్‌ను నియమించింది. గతంలో ఆజాద్ ఇంచార్జిగా పని చేసిన సమయంలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెసు పొత్తులో ప్రధాన భూమిక పోషించారు. దీంతో తిరిగి ఆజాద్‌ను కేంద్రం నియమించింది. అయితే ఆయన ఈసారి విఫలమైనట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ అంశంపై తానేమీ చేయలేనని, పార్టీ ఇంఛార్జిగా సమస్యను ఓ కొలిక్కి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించానని సీమాంధ్ర, తెలంగాణ ప్రజాప్రతినిధులతో తాను చర్చలు జరిపినా ఫలితం లేదన్నారు. సీమాంధ్రులు సమైక్యాంధ్రే కావాలని పట్టుబడుతుండగా, తెలంగాణ నేతలు తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటున్నారని సిఎంతో చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇలా ఎవరికి వారు ఓ మెట్టు దిగి రాకపోతే సమస్య ఎలా పరిష్కారమవుతుందని తాను ఏం చేయగలనని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రజాప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా తెలంగాణ అంశంపై తేల్చాలని అధిష్టానాన్ని కోరేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సైతం రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సైతం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications