నమ్మకం లేదన్న 'టిఆర్ఎస్'పై బిజెపి సీరియస్

BJP
కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తుందన్న భారతీయ జనతా పార్టీ హామీలను నమ్మలేమంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేత ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. శుక్రవారం నాటి బిజెపి ముగింపు సమావేశంలో సదరు తెరాస నేత వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు కట్టుబడి ఉంటామని బిజెపి ప్రకటించండంతో అద్వానీ రథయాత్రకు వచ్చిన అనూహ్య స్పందన, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అద్వానీ యాత్రలో పాల్గొనడం తెరాస నేతలు జీర్ణించుకోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన తెలంగాణ ఉద్యమ కమిటీ సమావేశంలో పలువురు నేతలు తెరాస తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ జెఏసిలో భాగస్వామ్య పక్షమని తెలిసినా బిజెపిపై విమర్శలకు దిగడమేమిటంటూ ప్రశ్నించారు.

అధికారంలోకి వస్తే తాము రాష్ట్రం ఇస్తామనే నమ్మకం లేకపోతే తమతో కలిసి ఎందుకు ఉద్యమిస్తున్నారో స్పష్టం చేయాలని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు తెరాస నేత వ్యాఖ్యల వెనుక అగ్రనేతలు ఉన్నారని ఆరోపించారు. జెఏసిలో తీసుకునే నిర్ణయాల్లో ప్రతిసారీ తమ పార్టీని పక్కన పెడుతూ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న తెరాస భాజపాను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. అయితే తెరాస తీరు చూస్తుంటే, అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చెబుతున్న భాజపా తెలంగాణలో బలపడితే తమ పార్టీ బలహీనపడవచ్చుననే భయం వారిలో ఉన్నట్లుగా కనిపిస్తోందనేది కొందరి వాదన.

అందుకే తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పినప్పటికీ జెఏసి సమావేశాలలో బిజెపికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు సానుకూలంగా లేవు. కాబట్టి వాటిపై పోరు చేయటంలో తప్పు లేదు. కానీ అనుకూలంగా ఉన్న తమపై విమర్శలు చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జెఏసి సమావేశాలలో టిఆర్ఎస్ ఒంటెత్తు పోకడలతో పోయి బిజెపి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం ఆ తర్వాత జెఏసి చైర్మన్ కోదండరాం వెళ్లి బిజెపి వారిని సముదాయించడం పరిపాటిగా మారిందట. అయితే టిఆర్ఎస్ తీరు ఇలాగే ఉంటే సొంత కార్యాచరణతో ముందుకెళదామని పలువురు నేతలు రాష్ట్ర అగ్రనేతలకు సూచిస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+