సిబిఐ చేతిలో 'గాలి' కోట రహస్యం

గాలి నివాసంలో సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాపులో కళ్లు చెదిరే కీలక సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. గాలి బ్రదర్స్ విదేశాలలో కూడా అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లు దీని ద్వారా తెలుస్తోంది. ఇది రుజువైతే గాలికి పదేళ్లకు పైగా జైలు శిక్ష పడటం ఖాయమట. గాలి వ్యవహారం ఢిల్లీ స్థాయిలోని బిజెపి నేతలకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం ఇరవై మంది వరకు నేతలు గాలి నుంచి ప్రయోజనాలు పొందారని ల్యాప్ టాప్ ద్వారా తెలుస్తోందని సమాచారం. దక్షిణాదిన మొట్టమొదటిసారిగా కర్నాటకలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం నాలుగుసార్లు సంక్షోభంలో పడింది. కొన్నింటిని గాలి స్వయంగా సృష్టించగా మరికొన్నింటిని ఆయనే పరిష్కరించారు. కర్నాటకలో బిజెపి ప్రభుత్వాన్ని కాపాడటానికి గాని, కూలదోయడానికి గాని ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించిన వివరాలు ల్యాప్ టాప్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
గాలి అరెస్టు సందర్భంగా సోదాలలో పట్టుబడిన సొమ్ము కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కోసమే ఉంచినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టడం, అనుమతి లేని ప్రాంతాలలో తవ్వకాలు జరిపిన అంశాల్లో సిబిఐకి ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. గనుల తవ్వకానికి గాలి జనార్ధన్ రెడ్డి వద్ద ప్రత్యేకంగా జియాలజిస్టులు ఉన్నారంట. వారికి లక్షల రూపాయల జీతం ఉంటుందట. గనులు ఎక్కడున్నాయో జియాలజిస్టులతో సర్వేలు చేయించడం వాటిని కొల్లగొట్టడమే గాలి పని అని తెలుస్తోంది. ఇండోనేషియా, పిలిప్సీన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా మైనింగ్ లీజులు పొందినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డికి పిలిప్సీన్ వెళ్లేందుకు వీసులు కూడా తెప్పించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications