వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగంపై బుసకొట్టిన చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Nagam Janardhan Reddy
ప్రత్యేక తెలంగాణ సెగ తెలుగుదేశం పార్టీని కుదుపుతున్నట్లుగా ఉంది. అయితే ప్రధాన పార్టీలలో టిడిపి సెగ విభిన్నమైనది. ప్రధాన కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ, సీమాంధ్రులు ఒక్కతాటి ఉన్నారు. కాని టిడిపిలో మాత్రం అధినేత మాటలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలలో విభేదాలు, సీమాంధ్రులలో తెలంగాణ తీర్మానంపై ఒకరు పట్టబడితో మరొకరికి అసంతృప్తిగా ఉండటం వంటి విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెడతామనే దానిలో భిన్న వాదనలు ఏమేరకు ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇప్పటికే నిరుత్సాహంగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్ తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య విభేదాలతొ మరింత క్షోభకు గురయినట్లుగా కనిపిస్తోంది.

టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ హోదాలో నాగం జనార్ధన్ రెడ్డి పూర్తిగా పార్టీ కార్యకలాపాలు పక్కన పెట్టినట్టుగా పలువురు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు భావించి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారని సమాచారం. తెలంగాణ విషయంలో నాగం దూకుడుగా వ్యవహరిస్తున్నారని, దూకుడుగా వ్యవహరించడం వల్ల లేనిపోని చిక్కులు వస్తున్నాయని, టిడిపిలో తెలంగాణకోసం ఆయన ఒకక్రే పోరాడుతున్నట్టుగా తెలంగాణ ప్రజలకు కనిపించే విధంగా నాగం ప్రయత్నిస్తున్నారనిమిగిలిన టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేల ఆరోపణలుగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి తెలంగాణ ఫోరం స్థానంలో తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తే దానికి అధినేత సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.

సమన్వయ కమిటీ ద్వారా నాగం జనార్ధన్ రెడ్డి దూకుడు తగ్గించాలని తెలంగాణ ప్రాంత నేతలతో పాటు చంద్రబాబు యోచిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తూ టిడిపికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న నాగం టిఆర్ఎస్ టిడిపిపై చేస్తున్న ఆరోపణలు మాత్రం సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదనే ఉద్దేశ్యంతో కూడా నాగంను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగంకు చెక్ చెప్పడానికే సమన్వయ కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు మొగ్గి చూపినట్టుగా తెలుస్తోంది. మరో విషయమేమంటే తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డికే సమన్వయ కమిటీ ఏర్పాటు విషయం తెలియదనే వార్తలు కూడా వస్తున్నాయి. నాగంకు తెలియకుండా, ఆయనతో మాట్లాడకుండానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని, మరో నాలుగైదు రోజుల్లో ఇందులో సభ్యులను ఎన్నుకునే అవకాశమున్నది.

అంతకుముందు మీడాయాలో తెలంగాణ కోసం హడావుడి చేసిన నాగం జనార్ధన్ రెడ్డి దూకుడును తెలంగాణ ఎమ్మెల్యేలు తగ్గిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక నాగం జనార్ధన్ రెడ్డి దాదాపు కనిపించకుండా పోయారు. గవర్నర్ ప్రసంగం రోజున టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ధీటుగా రేవంత్ రెడ్డి చేసిన గలాటా తెలంగాణ వ్యాప్తంగా హీరోను చేసిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత, చలో అసెంబ్లీ సందర్భంగా విద్యార్థులను అరెస్టు చేసిన విషయంపై నాగం హడావుడి చేద్దామనుకున్నా టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు చేయనివ్వనట్లుగా తెలుస్తోంది. కాగా నాగంకు చెక్ చెప్పడానికి ఏర్పాటు చేయనున్న సమన్వయ కమిటీ కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. నాగంకు అండగా ఉంటూ వస్తున్న ఎర్రబెల్లి దయాకరరావు ఈ కమిటీపై ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

English summary
Telugudesam Party facing trouble with Separate Telangana issue. Major Telangana TDP MLAs are unhappy with Nagam Janardhan Reddy activities as Telangana Forum convener. So They urged TDP president Chandrababu to launch Co-Ordination Committee. Chandrababu accepted their proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X