ఇక చిరంజీవి, జగన్ పోటా పోటీ!

Chiranjeevi-YsJagan
ఓ వైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ విలీనం ఆ తర్వాత మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం. ఇది జూలైలో జరగనుందని సమాచారం. సామాజిక న్యాయం నినాదంతో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జూలై 10న అధికారికంగా కాంగ్రెస్‌లో విలీనమవుతుండగా, ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తొలి ప్లీనరీని 8న నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్‌లో 8, 9 తేదీల్లో జగన్ ప్లీనరీ నిర్వహిస్తారని తెలుస్తుండగా, పదో తేదీన కాంగ్రెస్‌లో పిఆర్పీ విలీన సంబరాలు నిర్వహించాలన్న యోచనలో కాంగ్రెస్, పిఆర్పీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో జనసమీకరణకు విజయవాడ-గుంటూరు మధ్య విలీనసభ ఏర్పాట్లు చేయాలన్న యోచనలో కాంగ్రెస్, పిఆర్పీ నేతలున్నారు. ఇటీవల తిరుపతి పర్యటనలో భాగంగా పీఆర్పీ అంకురించిన స్థలంలోనే కాంగ్రెస్‌లో కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న కోరికను వెల్లడించారు.

తిరుపతిలో భారీ సమీకరణకు కొన్ని అవాంతరాలు ఉన్నాయని పిఆర్పీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో గానీ గుంటూరులో గానీ సభను పెడితే జనసమీకరణకు అనువుగా ఉంటుందని చెబుతున్నారు. వచ్చేనెల పదో తేదీన విలీన సభను ఏర్పాటు చేయాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీ హాజరవుతారని పీఆర్పీ నేతలు చెబుతున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ సభలోగా కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విలీనానికి గుర్తుగా ముందుగా రాష్ట్ర స్థాయిలో గాంధీభవన్‌లో సీఎం కిరణ్, పిసిసి అధ్యక్షుడు సత్తిబాబు సమక్షంలో చిరంజీవి కాంగ్రెస్‌లో తమ పార్టీని కలిపినట్లు ప్రకటిస్తారు.

తర్వాత ఇదే విధానాన్ని జిల్లా స్థాయిలో డిసిసి కార్యాలయాల్లో జిల్లాస్థాయి నేతలు అమలు చేస్తారు. ఇలా మండల, గ్రామస్థాయి వరకూ విలీన కార్యక్రమాలను నిర్వహిస్తారు.క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, పిఆర్పీ నేతలు అవగాహనకు వచ్చిన తర్వాత భారీస్థాయిలో బహిరంగసభ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎఐసిసిఅధ్యక్షురాలు సోనియాగాంధీ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయేందుకు వీలుగా కార్యక్రమాన్ని రూపొందించాలి. అందువల్ల రాత్రివేళల్లో విమాన రాకపోకలకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని పిఆర్పీ నేతలు అంటున్నారు. ఇందుకు విజయవాడ - గుంటూరు మాత్రమే అనువని అంటున్నారు. రాజమండ్రిలో సభ పెట్టాలన్న యోచనలో కొందరు ఉన్నారు. కాని.. దీనికి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+