హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ప్లాన్, తెలంగాణకు హైదరాబాద్ మెలిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: తెలంగాణపై ఉచ్చు బిగిస్తున్న స్థితిలో కాంగ్రెసు అధిష్టానం హైదరాబాద్ మెలిక పెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరంపై తగిన ఆధారాలను చూపేందుకు తగిన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాదుకు చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేయకపోవడాన్ని అందుకు కారణంగా చెప్పాలని అనుకుంటోంది. హైదరాబాద్, మిగతా తెలంగాణ జిల్లాలు ఒక్కటి కాదనే వాదనకు బలం చేకూర్చే ప్రయత్నాలు సాగిస్తోంది.

సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, మల్కాజిగి పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ రాజీనామా చేయకపోవడాన్ని, మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీ శానససభ్యులు ఎవరు కూడా తెలంగాణకు అనుకూలంగా ముందుకు రాకపోవడాన్ని, హైదరాబాదుకు చెందిన మెజారిటీ శాసనసభ్యులు రాజీనామాలు చేయకపోవడాన్ని ఎత్తి చూపే వ్యూహాన్ని అనుసరించాలని అనుకుంటోంది. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, కాంగ్రెసు శాసనసభ్యులు శశిధర్ రెడ్డి, మణెమ్మ, ఆకుల రాజేందర్ రాజీనామాలు చేయలేదు. కూకట్‌పల్లి శానససభ్యుడు జయప్రకాష్ నారాయణ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రాజీనామాల వ్యవహారాన్ని తన వ్యూహానికి అనుగుణంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని సమీకరించి హైదరాబాద్ మెలిక పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యను పరిష్కరించే అంశాన్ని వెనక్కి నెట్టాలని ప్రయత్నాలు సాగిస్తోంది. తమ తమ నియోజకవర్గాల ప్రజల నుంచి వారిపై ఒత్తిడి లేకపోవడం వల్ల రాజీనామాలు చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ఇదే కాంగ్రెసుకు ఇప్పుడు రక్షణ కవచంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ మాత్రం రాజీనామా చేశారు. అయితే, ఆమె రాజీనామా వెనక తెలంగాణ అంశం కన్నా వైయస్ జగన్ అంశమే ఎక్కువ పనిచేసిందనే వాదనను ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి.

English summary
Caught in a cleft stick over the Telangana issue, the UPA government is perceiving the decision of the city ministers and MLAs to stay away from the resignation drama as an indication that Hyderabad is not in sync with the remaining Telangana districts on the separate state issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X