కిరణ్, బొత్సకు దూరం పెరుగుతోందా?

ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు సకల జనుల సమ్మెపై అధిష్టానం ఇద్దరికీ చురకలంటించడంతో సమ్మె విరమింప చేయడానికి మాత్రమే ఇద్దరు కాస్త సమన్వయంతో వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇంతకుమించి వారు కలిసి పని చేసిన దాఖలాలు కనిపించడం లేదు. సమ్మె విరమణకై ఇద్దరు కలిసి పని చేయడంతో ఇక ముందు అలాగే ఉంటారని పలువురు భావించారు. కానీ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నప్పటికీ ఢిల్లీ వెళ్లిన బొత్స, కిరణ్ మాట్లాడుకున్న సందర్భమే కనిపించలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో మాట్లాడుకోలేదు. ఎవరికి వారే తమకు అనుకూలమైన అభ్యర్థుల పేర్లు అధిష్టానం ముందుకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎపి భవన్‌లో సిఎం కిరణ్ ఉంటే, బొత్స తన భార్య, పార్లమెంటు సభ్యురాలు ఐన ఝాన్సీ క్వార్టర్‌లోనే ఉన్నారు.
ఇద్దరు ఎవరి అభ్యర్థులను వారు ప్రతిపాదించడం, తెలంగాణ సమస్య కారణంగా అధిష్టానం స్వతంత్రంగా వ్యవహరించి మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పేరు ప్రతిపాదించింది. డిఎస్ కూడా మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. అధిష్ఠానం డిఎస్ వైపు మొగ్గు చూపడం చూసి బొత్స కూడా అటు వైపే మొగ్గు చూపారని, తద్వారా సిఎం ప్రతిపాదించిన అభ్యర్థికి అవకాశం రాకుండా చూశారని తెలుస్తోంది. తొలుత ఆరు పేర్లు చర్చకు వచ్చినా చివరకు సోనియా వద్దకు వచ్చేసరికి మూడే మిగిలాయని, ఈ ముగ్గురిలో డిఎస్ పేరునే మేడమ్ ఖరారు చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications