బొత్స, కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారా?

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
రాష్ట్రం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబట్టింది. ఆ తర్వాత అనిశ్చితి కొనసాగడంతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆమోదయోగ్యుడైన బొత్స సత్యనారాయణనను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే అధిష్టానం ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడంలో వీరిద్దరు విఫలమయ్యారా అంటే అవుననే పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య వయసుకు మించిన పని చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన హయాంలో తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. దానిని ఆపడంలో ఆయన విఫలమయ్యారు. ఆ తర్వాత జగన్‌ను సైతం అడ్డుకోవడంలో విఫలం అయ్యారు. దీంతో ఆయనే తనకు తాను సొంతగా బాధ్యతల నుండి తప్పుకున్నారు. తెలంగాణ ఉవ్వెత్తున ఎగుస్తున్న, జగన్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెసును లక్ష్యంగా చేసుకున్న క్లిష్ట పరిస్థితుల్లో జగన్ సామాజిక వర్గానికి చెందిన, యువకుడు అయిన కిరణ్ కుమార్ రెడ్డిని సిఎం పీఠంపై కూర్చుండ బెడితే ఆయనను ధాటిగా ఎదుర్కోడమే కాకుండా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తారని అధిష్టానం భావించింది. అయితే ఇందులో ఆయన పూర్తిగా విఫలం అయ్యారు.

రాష్ట్రంలో అనిశ్చితి ప్రధానమైన ఈ రెండు సమస్యలను పరిష్కరించడంలో సిఎం విఫలం కావడంతో సిఎంను మార్చలేని పరిస్థితుల్లో పిసిసి పీఠంపై బొత్సను కూర్చుండబెట్టింది. ఆయన తన చాతుర్యంతో తెలంగాణ, జగన్ సమస్యలు పరిష్కరిస్తారని అధిష్టానం గట్టి నమ్మకం పెట్టుకుంది. అయితే కిరణ్ కన్నా బొత్స మెరుగ్గానే ఉన్నప్పటికీ సమస్యలను ఇప్పటి వరకు పూర్తిగా మాత్రం పరిష్కరించలేక పోయాడు.

జగన్ వర్గాన్ని కొద్దిగా కట్టడి చేసినప్పటికీ పూర్తిగా మాత్రం సఫలం కాలేక పోయాడు. ఇక తెలంగాణ విషయంలో పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తారని ముందే తెలిసినప్పటికీ వారిని వారించడలో ఇద్దరూ విఫలం అయ్యారు. ఆ తర్వాత వారి రాజీనామాలు వెనక్కి తీసుకొమని బొత్స పలుమార్లు బుజ్జగించినప్పటికీ ఫలించలేదు. కనీసం ఢిల్లీకి వెళ్లాలన్న బొత్స మాటలను సైతం వారు అంతగా ఖాతరు చేయడం లేదు. మొత్తానికి అధిష్టానం ఏరికోరి తెచ్చుకున్న బొత్స, సిఎంల తీరుపై పూర్తి అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+