వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ ప్రమేయంతోనే జగన్ ఆగడాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy and YS Jaganmohan Reddy
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో మిలాఖత్ కావడం వల్ల అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ ఎఫ్ఐఆర్‌లో వైయస్ పేరును నమోదు చేశారు. అయితే ఈ కేసులో వైయస్ పాత్ర ఉన్నందున ఆయన పేరును నిందితుడిగా పేర్కొననప్పటికీ
ఎఫ్ఐఆర్‌లో మాత్రమే నమోదు చేశారు. అయితే వైఎస్ పేరును ఎఫ్ఐఆర్‌లో సీబీఐ ప్రస్తావించడంలో పెద్ద విశేషమేమీ లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ హయాంలో, ఆయన ద్వారా ప్రభుత్వ భూములు, ప్రాజెక్టులు మొదలైన మేళ్లు పొందినవారు, ఆయన కుమారుడు జగన్‌కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టారనేది కేసులో ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హైకోర్టు సైతం అభిప్రాయపడింది.

అంటే ఇది అవినీతికి, అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతానికి సంబంధించిన కేసు. అధికారిక హోదా రీత్యా చూస్తే జగన్ కేవలం ఒక ఎంపి. లోక్‌సభ సభ్యుడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో ఆయనకు ఏ ప్రమేయమూ లేదు. తనకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో అక్రమాలు జరగాలంటే ప్రభుత్వంలో ఉన్నవారు తనకు సహకరించాలి. ఈ పద్ధతిలో తన కంపెనీల్లోకి పెట్టుబడులను రప్పించుకోవాలంటే, రాష్ట్ర ప్రభుత్వంలో తన కోసం అధికార దుర్వినియోగం చేయగల పబ్లిక్ సర్వెంట్‌తో మిలాఖత్ కావడం జగన్‌కు అవసరం. అలా ఆయన మిలాఖత్ అయింది ఎవరితోనో కాదు; ముఖ్యమంత్రి హోదాలో ఉన్న, పబ్లిక్ సర్వెంట్ అయిన, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో!

అందుకే... 'ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి రాజశేఖరరెడ్డితో కలిసి, నేరపూరిత కుట్రకు పాల్పడడం ద్వారా, జగన్ నేరానికి పాల్పడ్డాడని' ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. 'ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రిపైనా, గుర్తు తెలియని అధికారులపైనా జగన్ ఇన్‌ఫ్లుయెన్స్ చూపించారని, వారు అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఆయా కంపెనీలకు, వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించారని సీబీఐ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చిపడ్డాయని సూత్రీకరించింది. వైఎస్ అండదండలే లేకపోతే జగన్ ఇన్ని అక్రమాలకు పాల్పడడానికి ఆస్కారమే లేదన్నది సీబీఐ వాదనగా కనిపిస్తోంది. అందుకే అది ఎఫ్ఐఆర్‌లో వైఎస్ పేరును ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు వైఎస్ జీవించి లేరు. చనిపోయిన వారి పేర్లను నిందితుల జాబితాలో చేర్చడం వీల్లేదు. అందువల్లే సీబీఐ వైఎస్ పేరును ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించి వదిలేసినట్లుగా తెలుస్తోంది. నిందితుల జాబితాలో చేర్చలేదు. జీవించి లేడన్న కారణంపై ఎఫ్ఐఆర్‌లో వైఎస్ పేరు కూడా ప్రస్తావించకుండా ఆయనకు 'ఇమ్యూనిటీ' (రక్షణ) కల్పించడం వీలు కాదని వారు స్పష్టంచేస్తున్నారు. వైఎస్ ద్వారా 'మేళ్లు' పొందినవారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కేసులో... వైఎస్ పేరు ప్రస్తావించకుండా ఉండడం అసలు ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. అయితే "ఆనాటి ప్రభుత్వం అంటే వైఎస్ ఒక్కరే కాదు. భూములు, ప్రాజెక్టుల కేటాయింపు నిర్ణయాలు తీసుకున్నది మొత్తం మంత్రివర్గం. అందువల్ల ఎఫ్ఐఆర్‌లో ప్రభుత్వం అని పేర్కొనాలి తప్ప వైఎస్ ఒక్కరి పేరునే ప్రస్తావించడం సరికాదు'' అనేది మరో వాదన. కానీ మంత్రివర్గ ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి సంబంధించినది. అంటే తాను కోరుకున్నవారిని ఉంచవచ్చు, వద్దనుకున్నవారిని తొలగించవచ్చు.

అందువల్ల సీఎం నిర్ణయాన్ని మంత్రివర్గం ధిక్కరించడం కష్టసాధ్యమనే వాదనను కొందరు న్యాయ నిపుణులు, నాయకులు వినిపిస్తున్నారు. భూములు, ప్రాజెక్టుల కేటాయింపులో మంత్రివర్గానికి సమష్టి బాధ్యత ఉంటుంది తప్ప, తెరవెనక జరిగే వ్యవహారాలతో సంబంధం లేదని నాటి వైఎస్ కేబినెట్‌లో మంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే పేర్కొన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, గీతారెడ్డి వంటివారు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ముడుపులు తీసుకుంటే తప్పుగానీ మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు తీసుకుంటే తప్పేమిటని పలువురు మంత్రు లు ప్రశ్నిస్తున్నారు.

English summary
It seems, YSRC party president YS Jaganmohan Reddy was colluded with late YS Rajasekhar Reddy in the time of YSR CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X