కెసిఆర్‌కు వైయస్ జగన్ గుబులు

కానీ, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకే కాదు, కెసిఆర్‌కు కూడా దిమ్మ తిరిగే విధంగా వైయస్ జగన్ తెలంగాణలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జై తెలంగాణ నినాదంతో ఆయన తెలంగాణలో కాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే, తెరాస కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కెసిఆర్ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాదని కెసిఆర్ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కానీ, తెలంగాణ ప్రజలకు కెసిఆర్‌ను బలపరచడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు జై తెలంగాణ నినాదంతో జగన్ ముందుకు వస్తే అన్ని పార్టీలూ తుడిచిపెట్టుకు పోయినా ఆశ్చర్యం లేదు.
కెసిఆర్‌కు రెడ్లు చాలా వరకు దూరంగానే ఉన్నారు. జగన్ తెలంగాణ నినాదంతో ముందుకు వస్తే కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే కాదు- తెరాస నాయకులు, కార్యకర్తలు కూడా జగన్‌కు జై కొట్టడం ఖాయం. రెడ్లు చాలా వరకు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే వెళ్తారు. కేవలం తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మాత్రమే వైయస్ జగన్‌కు ఆటంకంగా ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలో కూడా విశేష మద్దతు, ఆదరణ ఉంది. తెలంగాణ సమస్యను జగన్ పరిష్కరించుకోగలితే మిగతా పార్టీలకు ఆయన సింహస్వప్నం కావడం ఖాయం.
వైయస్ జగన్ ఇతర పార్టీలతో పొత్తుకు కూడా ముందుకు వచ్చే సూచనలు లేవు. తెరాసతో ఆయన పొత్తు పెట్టుకుంటారనేది ఉత్త మాటే. సొంత బలం మీద, ప్రజాదరణ మీద ఆధారపడి ఆయన ఇతర రాజకీయ పార్టీలను మట్టి కరిపించే లక్ష్యంతోనే ఉన్నారు. అందువల్ల తెలంగాణ సమస్యను పరిష్కరించుకుని ముందుకు వచ్చేందుకే రంగం సిద్దం చేసుకుంటున్నారని అంటున్నారు. అదే భయం కెసిఆర్‌ను ఇప్పుడు వెన్నాడుతోందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications