బాబుకు అచ్చిరాని ఉప నాయకత్వం

దేవేందర్ బయటకు వెళ్ళిన తర్వాత తెలుగుదేశం ఉపనాయకునిగా మారిన నాగం జనార్ధన్ రెడ్డి తమ అదినేత సూచనలతో అప్పుడు దేవేందర్ పై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, అలా చంద్రబాబుతో మంచి మార్కులే కొట్టేశాడు. అలా జీవితం గడిపేస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి ఉస్మానియాలో తనపై జరిగిన దాడితోనో లేదా ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుల గొప్ప విజయంతోనో లేదా తెలుగుదేశం అభ్యర్థులకు డిపాజిట్ పోయిందనో జ్ఞానోదయమైనట్లుంది. ఇక తమ అధినేతను ఒప్పించలేమని తెలిసిన నాగం వేరుకుంపటి పెట్టుకొన్నాడు. కాకపోతే నాగం కాస్త తెలివిగా సొంత పార్టీ జోలికి పోకుండా ఇప్పటికే తెలంగాణలో సక్సెస్స్ అయిన తెరాసతో జతకట్టడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదీ మనకు తెలిసిందే.
తెలుగుదేశంలో ప్రస్తుతం నాగం జనార్దన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేస్తున్న ఇప్పటి నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి వగైరా నాయకులకు ఏరోజైన నాగంలా జ్ఞానోదయమై తెలంగాణాపై చిత్తశుద్ధిని ప్రదర్శించాలని, ఇక తమ అధినేతను ఎప్పటికీ ఒప్పించలేమని ఏదో ఒకరోజు నాగం బాటే పడతారేమో! ఇలా తెలుగుదేశంలో ఉపనాయకత్వం స్థానాలను కోల్పోక తప్పట్లేదు. ఇలా తెలంగాణలో తెలుగుదేశం ఉపనాయకత్వం ఖాళీ అవుతుందో లేదా దేవేందర్, పెద్దిరెడ్డిలా పార్టీలు పెట్టి, మరో పార్టీలో విలీనం చేసి, ఎన్నికల్లో ఓడిపోయి, నానా అవస్థలు పడి తిరిగి తిరిగి సొంతగూటికే చేరుకొంటారో ఏమో...
ఇదిలావుంటే దేశ రాజకీయాల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చక్రాలు తిప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మెదడులో ఇప్పుడు ఈ తెలంగాణా సమస్యతో తెలంగాణలో పార్టీని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచనలతో చాలా చక్రాలే తిరుగుతుండవచ్చు. తెలుగుదేశం భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాం.
- కిరణ్ కుమార్
రచయిత అభిప్రాయాలతో దట్స్ తెలుగు డాట్ కామ్‌కు ఏ విధమైన సంబంధం లేదు.












Click it and Unblock the Notifications