కిరణ్ ధీమా, 162 మంది సభ్యుల బలం?

ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడానికి 144 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. జగన్ వర్గానికి చెందిన 17 మంది సభ్యులను మినహాయిస్తే కాంగ్రెసు సభ్యుల సంఖ్య 136 అవుతుంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన 17 మంది, మజ్లీస్‌కు చెందిన ఏడుగురు కాంగ్రెసుకు మద్దతిస్తున్నారు. ఆ రకంగా కాంగ్రెసు బలం 160 అవుతుంది. ఓ అనుబంధ సభ్యుడు, మరో నామినెటెడ్ ఎమ్మెల్యేతో కలుపుకుంటే కాంగ్రెసుకు శానససభలో 162 మంది సభ్యుల బలం ఉంది.
ప్రతిపక్షాల బలమంతా కలిపితే 124 మంది సభ్యులే అవుతున్నారు. జగన్ వర్గానికి చెందిన 17 మందిని కలిపినా ప్రతిపక్షాల బలం అంతే. తెలుగుదేశం సభ్యులు 86 మంది ఉన్నారు. సుమన్ రాథోడ్ ఎన్నిక వివాదం సుప్రీంకోర్టులో ఉండడంతో ఆమెకు ఓటు హక్కు ఉండదు. దాంతో తెలుగుదేశం సంఖ్యాబలం 85 అవుతుంది. తెరాస సభ్యులు 12 మంది ఉన్నారు. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 17 మంది ఉన్నారు. వామపక్షాల సభ్యులు ఐదుగురు, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి, స్వతంత్ర అభ్యర్థి, లోకసత్తా సభ్యులు ఒక్కరేసి ఉన్నారు. మొత్తం ప్రభుత్వ వ్యతిరేక బలం 124 అవుతుంది. జర్మనీలో ఉన్న తెరాస సభ్యుడు చెన్నమనేని రమేష్ రాలేకపోయారు. మొత్తం మీద, తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం సులభంగానే ఓడించే పరిస్థితి ఉందని ప్రస్తుతం సాగుతున్న అంచనా.












Click it and Unblock the Notifications