వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసదుద్దీన్‌కు షాక్, అందుకే కెసిఆర్‌తో భేటీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్న ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి మంగళవారం పాతబస్తీ ప్రాంతవాసులు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సచార్ కమిటీ సిపార్సులు రాష్ట్రంలో అమలు చేసేలా ప్రయత్నించాలని కోరడానికే తాను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులను కలుస్తున్నట్లుగా అసదుద్దీన్ చెప్పినప్పటికీ తెలంగాణ అంశం కోసమే ఆయన కలుస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. సచార్ కమిటీ అని చెప్పినప్పటికీ తెలంగాణపై కేంద్రం మధ్యవర్తిగా చంద్రబాబు, కెసిఆర్ తదితరులను కలుస్తున్నారనే వాదనలు వచ్చాయి. దీంతో ఎంఐఎం తెలంగాణ వైపు క్రమంగా మొగ్గుతుందా అనే చర్చ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా రాష్ట్రం అంటే బర్త్ డే కేక్ కట్ చేసినంత ఈజీ కాదని చెప్పిన రెండు రోజులకే ఆయన కెసిఆర్‌ను కలవడం వెనుక పాతబస్తీ తెలంగాణవాదులు ఉన్నారని తెలుస్తోంది.

మైనార్టీల అభివృద్ధికి సచార్ కమిటీ చేసిన సిఫార్సుల విశ్లేషణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జూబ్లీహాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలను తీసుకు పోవాల్సి వచ్చింది. ఇందుకు కోసం ఎంఐఎం జనసమీకరణ చేస్తుండగా స్థానిక తెలంగాణవాదులు ఎంఐఎం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తాము కార్యక్రమానికి వస్తామని అసదుద్దీన్‌కు చెప్పారట. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారట. పాతబస్తీ వాసుల్లో తెలంగాణ సెంటిమెంటు ఉండటాన్ని చూసి అసదుద్దీన్ ఆశ్చర్యపోయారట! ఈ కారణంగానే ఆయన కెసిఆర్‌తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పాతబస్తీవాసుల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉందనే అభిప్రాయానికి ఎంఐఎం వచ్చిందని తెలుస్తోంది. దీంతో తెలంగాణపై పార్టీ పునరాలోచించనున్నట్లుగా సమాచారం.

English summary
It seems, Old city people urged Hyderabad MP Asaduddin Owaisi to support Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X