ఇన్నాళ్లకు సోనియాకు తెలంగాణ సెగ

తెలంగాణపై ఎట్టకేలకు కాంగ్రెసు అధిష్టానం కదిలింది. ఇన్నాళ్లకు తెలంగాణ అంశాన్ని తీవ్రంగా పరిణగణలోకి తీసుకుందని అనిపిస్తున్నది. బహుశా, ఇప్పటి వరకు తనకు అందిన తప్పుడు సమాచారం వల్లనే తెలంగాణను తేల్చాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉండి ఉంటుంది. రాజకీయ నాయకులు మాత్రం తమ ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని, ప్రజల్లో ఉద్యమం లేదని సీమాంధ్ర నాయకులో, మరెవరో అందించిన సమాచారన్నే గట్టిగా నమ్ముతూ వచ్చినట్లు భావించవచ్చు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు చెప్పిన మాటలను కూడా బేఖాతరు చేస్తూ వచ్చింది.
ఒకానొక సందర్భంలో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ ఇవ్వకతప్పదనే అభిప్రాయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చెప్పారు. వేడి తగిలితే గానీ, రాష్ట్రం అస్తవ్యస్తమై స్తంభిస్తే గానీ, ఆ స్తంభన ప్రభావం సీమాంధ్ర నాయకులపై కూడా పడితే గానీ అర్థం కాంగ్రెసు అధిష్టానానికి తేలు కుట్టలేదని అనుకోవాల్సి వస్తుంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తీవ్రంగా పట్టించుకుని అధ్యయనం చేస్తే తప్ప సమస్య తీవ్రత ఏమిటో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అర్థం కాలేదని అనుకోవాల్సి వస్తున్నది. తెలంగాణకు అనుకూలంగానా, వ్యతిరేకంగానా అనే విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో మాత్రం కాంగ్రెసు అధిష్టానం పడింది.












Click it and Unblock the Notifications