తెలంగాణ: ష్ గప్ చుప్!

YS Jaganmohan Reddy and Balakrishna
ఇటీవలి కాలంలో తెలంగాణ అంశం రాజకీయ, సినీ ఇండస్ట్రీ అని లేకుండా అన్నింటి పైనా ప్రభావం చూపుతోంది. సీమాంధ్ర రాజకీయ నేతలు మినహా మిగిలిన ఎవరూ ఏ ప్రాంతానికి చెందిన వారైనా తెలంగాణపై మాట్లాడడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. కొన్ని రాజకీయ పార్టీల అధినేతలైతే ఆ అంశంపై దాటవేట ధోరణి అవలంభిస్తున్నారు. తెలంగాణపై మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని ఇటీవలె జరిగిన కొన్ని సంఘటనలు చూసినా అర్థమవుతుంది. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా నందమూరి హీరో బాలకృష్ణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్రం విడిపోకుండా సుభిక్షంగా ఉండాలన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పలు సినిమాల్లో నటించిన ఎంపీ విజయశాంతి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకుంటే సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు.

మరికొద్ది రోజుల్లో బాలయ్య శ్రీరామరాజ్యం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని భావించారో మరే కారణమో కాని మరుసటి రోజు బాలయ్య దానిపై వివరణ ఇచ్చారు. తనను అనవసరంగా తెలంగాణ వ్యతిరంగా ముద్ర వేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని తాను కలిసి ఉండాలని చెప్పలేదని గత చరిత్రను చెప్పి శుభాకాంక్షలు తెలియజేశానని వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సినిమా షూటింగులను కూడా తెలంగాణవాదులు అడ్డుకొంటూ హీరో, హీరోయిన్లతో జై తెలంగాణ నినాదాలు చేసే దాకా పట్టు వదలడం లేదు. మొన్న హీరో నితిన్, నిన్న హీరోయిన్ శ్రియ జై తెలంగాణ నినాదాలు చేసిన వారిలో చేరిపోయారు. ఇక రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని చెబుతున్న తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉంది. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడూ తెలంగాణలో తిరగలేని పరిస్థితి.

తెలంగాణపై చంద్రబాబును అడిగినప్పుడల్లా రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, తాము తమ నిర్ణయాన్ని గతంలోనే చెప్పామని చెబుతూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చి జాతీయ మీడియాను ప్రభావితం చేసే స్థాయిలో జాతీయ స్థాయి కాంగ్రెసు నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణ విషయంలో చేతులెత్తేశారు! తెలంగాణకు అనుకూలమా కాదా చెప్పకుండా తాము నిర్ణయం తీసుకునే స్టేజ్‌లో లేమని చేతులు దులుపుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+