జగన్ వెనుకడుగు ఎందుకు?

అంతేకాకుండా తనకు ఖచ్చితమైన ఎమ్మెల్యేలు ఎందరు మద్దతు పలుకుతున్నారో తెలియకుండా తన తరఫున వారిని రంగంలోకి దింపి తీరా ఓటమి చెందితే ఆ ప్రభావం త్వరలో రానున్న కడప, పులివెందుల ఎన్నికలపై పడుతుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గెలిస్తే ఫరవాలేదు. కానీ కాంగ్రెసుకు ఉన్న ఓటు బ్యాంకు దృష్ట్యా ఆయన ఓటమి చెందటం ఖాయంగా కనిపిస్తుంది. లేదా కాంగ్రెసును దెబ్బతీసినా తెలుగుదేశం బలపడే అవకాశం ఉంది. ఎటూ ఆయనకు లాభం లేదు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలనుండి తప్పుకొని కడప ఉప ఎన్నికలలో ఎమ్మెల్సీ ప్రభావం పడకుండా, తన వెంట ఉన్న నేతలలో అసంతృప్తి ప్రబలకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఈ ఎన్నికలలో తన వర్గం వారిని వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెసును దెబ్బ తీస్తారని భావించిన ఆయన వర్గం వారికి ఇది చేదు వార్తే. అయితే జగన్ బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా తన వర్గం వారని పోటీకి నిలబెట్టడం విశేషం. గెలిస్తే జగన్ వర్గం గెలిచిందని, ఓడిపోతే నేను మద్దతు ప్రకటించలేదని చెప్పే అవకాశాలు ఉంటాయనే అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు ఇతర నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశం లేకుండా ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆయన కాంగ్రెసుకు ధీటుగా ఇతర అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ బహిరంగంగా ప్రకటించడం లేదు.