వైయస్ జగన్ సాంపిల్ మాత్రమే చూపించారా?

హిందూజా పవర్ ప్లాంటుకు సంబంధించి అధిష్టానం ఒత్తిడి తేవడం వంటి వివరాలు అన్ని వైయస్ జగన్ వద్ద ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హాస్పిటాలిటీకి పెద్ద యెత్తున భూమి కేటాయింపు అహ్మద్ పటేల్ ఒత్తిడి వల్లనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దానికి అప్పట్లో అంత పెద్ద భూకేటాయింపులపై వైయస్సార్ ప్రభుత్వం మీద విమర్శలు కూడా వచ్చాయి. అలాగే దిగ్విజయ్ సింగ్ ఒత్తిడి మేరకు అప్పట్లో వైయస్సార్ హైదరాబాదు కమిషనర్‌ను మార్చినట్లు చెబుతున్నారు. వైయస్సార్ ప్రభుత్వంపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ఎవరెవరు ఏ విధంగా ఒత్తిడి తెచ్చింది, ఎవరెవరు ఏ విధంగా లబ్ధి పొందింది వెల్లడిస్తానని జగన్ చెప్పకనే చెప్పారని అంటున్నారు.
అధిష్టానం పెద్దలు వైయస్సార్‌పై ఒత్తిడి తెచ్చి పనులు చేసుకోవడం వెనక సోనియాకు కూడా సంబంధం ఉందా అనే సందేహాలు వ్యక్తమయ్యేలా జగన్ వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సోనియాకు పెద్ద యెత్తున ముడుపులు చెల్లిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు. వాటి గుట్టు విప్పుతానని జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications