వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 8లోగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫిబ్రవరి 8వ తేదీలోగా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పార్టీ విప్‌ను ధిక్కరించి, కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసిన వైయస్ జగన్ వర్గం శానససభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, తన ముందు హాజరు కావాలని స్పీకర్ వారికి నోటీసులిచ్చి, వారి భేటీకి తేదీలు కూడా ఖరారు చేశారు. కానీ జగన్ వర్గం శాసనసభ్యులు తాము హాజరు కాబోమని తేల్చి చెప్పారు. స్పీకర్ సాక్షిగానే తాము తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశామని, తాము పార్టీ విప్‌ను ధిక్కరించామని చెప్పడానికి స్పీకరే సాక్షి అని, అందువల్ల స్పీకర్‌కు తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని వారంటున్నారు. తమపై అనర్హత వేటు వేయాలని కూడా వారు కోరుతున్నారు. ఈ స్థితిలో స్పీకర్ ఏం చేయాలనే విషయంపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.

శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈలోగా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఫిబ్రవరి 8వ తేదీలోగా వాటిని తేల్చేయవచ్చునని చెబుతున్నారు. అయితే, తెలంగాణలోని శానససభా నియోజకవర్గాలకు, జగన్ వర్గం శానససభ్యులపై వేటు వేస్తే ఖాళీ అయ్యే స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరగకూడదనే ఎత్తుగడతో కాంగ్రెసు వ్యవహరిస్తోందని, అందువల్లనే తమపై వేటు వేయడం లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు విమర్శిస్తున్నారు. తెలంగాణలోని ఆరు స్థానాలకు, నెల్లూరు జిల్లాలోని కోవ్వూరు శాసనసభా నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అది ప్రకటించిన తర్వాత జగన్ వర్గం శాసనసభ్యులపై వేటు పడుతుందని అంటున్నారు.

కాగా, ఉప ఎన్నికలు జరిగే స్థానాలను తగ్గించాలనే ఎత్తుగడతో కాంగ్రెసు పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకేసారి 26 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే మినీ సాధారణ ఎన్నికలను తలపిస్తుందని, ఇందులో వ్యతిరేక ఫలితాలు వస్తే 2014లో వచ్చే సాధారణ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుందని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో వైయస్ జగన్ వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులను తమ వైపు లాక్కోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that Assembly speaker Nadendla Manohar may take action on YS Jagan camp MLAs before February 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X