అందరి టార్గెట్ కూడా కొండా సురేఖనే

పరకాలలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌నుండి గెలిచిన కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితంగా నిలిచారు. కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళి సన్నిహితత్వం కారణంగానే వీరిద్దరికీ వైఎస్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన కొత్తలో కొండా సురేఖ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆమెకు కాంగ్రెసు టికెట్ దక్కింది.
ఆత్మహత్యలు చేసుకున్న పత్తిరైతులను పరామర్శించేందుకు వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు సోనియా గాంధీ కొండా సురేఖ చురుకుదనాన్ని చూసి మురిసిపోయారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంచిన తర్వాత, రోశయ్య ముఖ్యమంత్రి కావడంతో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. పార్టీ విప్‌ను ధిక్కరించడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో పరకాలకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
కొండా సురేఖకు సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన అధికార గణాన్ని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసినట్లు సమాచారం. కొండా అనుచరులను లొంగదీసేందుకు కాంగ్రెసు నాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఓ వైపు బిజెపి, మరో వైపు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పరకాల సీటును తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. కొండా సురేఖకు ఇది కలిసి వస్తుందని భావిస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కూడా పోటీలో ఉంటున్నాయి. ఈ బహుముఖ పోటీలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు కొండా సురేఖ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications