వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రోజులు 4 గంటలు: ఒక్క ఇష్యూ లేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
ఐదు రోజుల పాటు జరిగిన వర్షాకాల శాసనసభ సమావేశాల్లో సభ్యులు ఒక్క అంశం పైనా చర్చించలేదు. సోమవారం నుండి ప్రారంభమైన సమావేశాలు తొలి రోజు నుండే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. తొలి రోజు సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే తెలంగాణపై తీర్మానం, విద్యుత్ సమస్య పేరుతో వాయిదా పడింది. ఆ రోజు నుండి శనివారం వరకు(బుధవారం వినాయక చవితి రోజు సెలవు దినం) ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు.

దాదాపు ఏడాదిగా విద్యుత్తు కోతతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి. పంటలు సరిగా పండక, విద్యుత్తు లేక ఉన్న వాటికి సరిగా నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాగుతో పాటు తాగునీటి కష్టాలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ సభలో మాత్రం వాటి పరిష్కారం కోసం కాసేపు కూడా చర్చ జరగలేదు. ఐదు రోజులు సమావేశాలు జరగ్గా మొత్తంగా చూస్తే సభ నాలుగు గంటలకు అటు ఇటుగా మాత్రమే నడిచింది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు నిమిషాలు మాట్లాడితే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఐదు నిమిషాలు మాట్లాడారు. సభ నడిచిన నాలుగు గంటల్లో గం.1.23నిమిషాలు సంతాప తీర్మానాలకు, వాయిదా తీర్మానాల తిరస్కరణకు 37 నిమిషాలు, అవాంతరాలకు గం.1.13 నిమిషాలు, స్పీకర్ ప్రకటనలకు ఎనిమిది నిమిషాలు పోయింది. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెసు గం.1.06 నిమిషాలు, టిడిపి 39 నిమిషాలు, తెరాస 52, బిజెపి 20, వైయస్సార్ కాంగ్రెసు 18, ఎంఐఎం ఆరు, సిపిఐ 14, సిపిఎం 12, లోక్‌సత్తా ఆరు, స్వతంత్రులు 17 నిమిషాలు మాట్లాడారు.

సభ జరిగే తీరుపై అధికార, విపక్ష సభ్యులు అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. సభకు రావడం ఐదు పది నిమిషాల్లో వాయిదా పడి బయటకు వెళ్లడం ఈ ఐదు రోజులు పరిపాటిగా సాగింది. కాగా సభకు కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే ఆలస్యంగా రావడం గమనార్హం. సభ నడిపే తీరుపై విప్‌లకు కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు కూడా చేయలేదట. దీంతో ప్రభుత్వం కేవలం మొక్కుబడిగా మాత్రమే సమావేశాలు నిర్వహించాలని చూసిందని విపక్షాలు ఆరోపించాయి.

English summary
Assembly has been adjourned without taking any issue for debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X