యుపిలో తెలుగోళ్లకు చుక్కెదురు, పటాన్‌చెరు వాసి విన్

మొరాదాబాద్, మొరాదాల నుండి ఎస్పీ, బర్హపూర్ లో బిఎస్పీ, కాంత్ లో పీస్, ఠాకుర్ లో బిజెపి పార్టీలు గెలుపొందాయి. మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అజహరుద్దీన్ పైన తీవ్ర వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చాయి. ఆయన గెలిచినప్పటి నుండి తన పార్లమెంటు పరిధి అభివృద్ధిపై దృష్టి సారించలేదని, అక్కడ సందర్శించిన సందర్భాలు తక్కువేనని అంటున్నారు. అందుకే ఆయన ప్రచార సమయంలో తన నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఇబ్బందులు పడినట్లు వార్తలు వచ్చాయి. ఇక రాంపూర్ స్థానం నుండి కూడా ప్రముఖ తెలుగు నటి, ఆంధ్రా నుండి యుపి షిఫ్ట్ అయిన రాజకీయ నాయకురాలు జయప్రద కూడా తన అభ్యర్థిని గెలిపించుకోలేక పోయింది. తన ప్రత్యర్థి అజంఖాన్‌ను ఓడించేందుకు ఆమె తీవ్రంగా కృషి చేసింది. ఆయనే లక్ష్యంగా రాంపూర్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసింది. అయినప్పటికీ ఆమె అజంఖాన్ గెలుపును అడ్డుకోలేక పోయింది.
కాగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు వాసి మనోజ్ కుమార్ సింగ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. చందూరు జిల్లా సయ్యద్ రాజా నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసి గెలిచారు. మనోజ్ తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే యుపి నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అయితే మనోజ్ మాత్రం అక్కడి రాజకీయాలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎస్పీ నేత అయిన ఆయనకు ఆ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications