వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోరిజల్ట్: సీమనేతలకు తెల్సిందే కెసిఆర్ చెప్పారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - T G Venkatesh
తెలంగాణ విషయంలో చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ చెప్పిందే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెబుతున్నారా అంటే అవుననే అనవచ్చు. టిజి వెంకటేష్ గత కొంతకాలంగా 2014 సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు కేంద్రం తెలంగాణపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెబుతూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందువల్ల కేంద్రం గానీ, కాంగ్రెసు గానీ ఇప్పటికిప్పుడు తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవని చెప్పారు.

ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే రెండు ప్రాంతాల నుండి ఇబ్బందులు ఏర్పడుతాయని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటే సీమాంధ్రలో, సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటే తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతాయని, ఇంత ముందుగా తీసుకొని సెగ పెట్టుకునేందుకు సిద్ధంగా లేవని చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని, ప్రత్యేకత లేదని వెళ్లేముందు చెప్పి.. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మీడియాకు తెలియకుండా తెలంగాణపై చాలామంది పెద్దలతో మాట్లాడనని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వ్యాఖ్యలకు, టిజి వ్యాఖ్యలకు పొంతన కనిపిస్తోంది.

సమావేశాలు రెండు రోజులు ఉన్నాయనగా వెళ్లిన కెసిఆర్ నెల రోజులపాటు అక్కడే ఉన్నారు. తెలంగాణపై సీనియర్లతో మాట్లాడిన చర్చలు సఫలమయ్యాయని, తాను త్వరలో మరోమారు ఢిల్లీ వెళ్లి రెండో విడత చర్చలు జరుపుతానని అప్పుడు ఫైనల్ అవుతాయని చెప్పారు. ఆయితే ఎప్పుడూ దాదాపు ఇదే పాట పాడే కెసిఆర్ ప్రకటనను పలువురు కొట్టి పారేస్తున్నారు. అయితే కెసిఆర్ పక్కా వ్యూహంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.

ఆయన చెప్పినట్లుగా చాటుమాటుకు ఎవరితో మాట్లాడారో లేదో తెలియదు. కానీ ఆయన వ్యాఖ్యలు టిజి వ్యాఖ్యలకు దగ్గరగానే ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ సీమాంధ్ర నేతలకు అధిష్టానం నుండి ఎప్పుడో అందిన సమాచారాన్నే మోసుకొచ్చారు. సాధారణ ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర కాలం ఉంది. కెసిఆర్ త్వరలో అని చెప్పారంటే ఆయన మళ్లీ పది రోజుల్లోనో లేదా నవంబరులోనో మళ్లీ వెళ్లి నాలుగైదు రోజుల్లో ఫైనలైజ్ చేసుకొస్తారని ఎవరూ భావించారు.

ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లడానికి కాస్త సమయం తీసుకుంటుంది. అటు ఇటు తిరిగి నెలలు కూడా పట్టవచ్చు. అంటే ఎలా చూసినా తెలంగాణపై ప్రకటన రావడానికి మరో ఏడెనిమిది నెలలు ఖచ్చితంగా పడుతుంది. సీమాంధ్ర నేతలు చెబుతున్నది కూడా అదే. అంటే కెసిఆర్ ఢిల్లీ వెళ్లి కొత్తగా మోసుకొచ్చిందేమీ లేదని, అయితే వెళ్లి చర్చించినందుకు తానేదో సాధించానని చెప్పుకునేందుకే ప్రకటన చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

English summary
It is said that Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao was gave statement on Wednesday, what minister TG Venkatesh is saying recently in his pressmeet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X