వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అరెస్టు: ఒక్కటైన రెండు కుటుంబాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy-YS Rajasekhar Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, ఆయన సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి కుటుంబం ఒక్కటైంది. వైయస్ జగన్ అరెస్టు గురించి చూచాయగా అర్థం చేసుకున్న వివేకా కొద్ది రోజుల క్రితమే కాంగ్రెసుకు గుడ్ బై చెప్పారు. వైయస్ మృతి అనంతరం వివేకా కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

పలుమార్లు ఆయన తాను కాంగ్రెసులోనే ఎదిగానని, తన సోదరుడు కూడా కాంగ్రెసు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారని, తాను ఆయన దారిలోనే నడుస్తానని చెప్పారు. కానీ జగన్ అరెస్టు గురించి జోరుగా వారం రోజులుగా వార్తలు రావడంతో కలత చెందిన వివేకా కాంగ్రెసును వీడారు. జగన్‌కు దగ్గరయ్యారు. సోమవారం కూడా వైయస్ వివేకానంద రెడ్డి, ఆతని కుమార్తె నర్రెడ్డి సునీత కోర్టుకు వచ్చారు.

సిబిఐ చేతిలో అరెస్టయిన తన అన్న కొడుకు వైయస్ జగన్‌ని ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఓదార్చారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఉన్న జగన్‌ను.. సోమవారం ఉదయం నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు తరలించారు. అంతకుముందు ఆయనను భార్య భారతీ రెడ్డి, సోదరి షర్మిలతో పాటు.. బాబాయ్ వివేకానంద రెడ్డి కూడా వచ్చి కలిశారు.

జగన్‌ను కోర్టులో హాజరుపర్చినప్పుడు వివేకానంద రెడ్డి కూతురు నర్రెడ్డి సునీత జగన్ సతీమణి భారతితో కలిసి ఉన్నారు. బ్రేక్ సమయంలో భారతి తన భర్త జగన్‌తో మాట్లాడుతూ కనిపించారు. ఆమె లంచ్‌కు వెళ్లలేదు. వైయస్ వివేకా కాంగ్రెసులో ఉన్నప్పుడు గత ఉప ఎన్నికలలో తన వదిన వైయస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాకుండా వైయస్ జగన్ పైన తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిచే పోటీ చేయించాలని ప్రయత్నాలు చేశారు.

కాని అది కుదరలేదు. రాజకీయంగా వైయస్ జగన్‌తో వివేకానంద రెడ్డి తీవ్రంగా విభేదించారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తుండటం, వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడం వంటి కారణాలతో ఆయన కాంగ్రెసుకు పూర్తిగా దూరమయ్యారు.

English summary
The arrest of YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy has united the families of the two brothers, YS Vivekananda Reddy and late YS Rajasekhar Reddy. In court on Monday, Mr Vivekananda Reddy's daughter Dr Narreddy Sunita was seen along with Mr Jagan's wife Bharati Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X