వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యర్థులపై కిరణ్ కుమార్ రెడ్డి కొరడా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
పార్టీలోని, మంత్రి వర్గంలోని తన ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొరడా ఝళిపిసస్తున్నారు. తన మంత్రి వర్గంలోని కొంత మంది నిజస్వరూపాలను అధిష్టానానికి తెలియజేసేందుకు పూనుకున్నారు. తనకు సహకరించకుండా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించమే కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఎలా పనిచేస్తున్నారో ఆయన పార్టీ అధిష్టానానికి వివరించే ప్రయత్నాలు చేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ రంగా రెడ్డిని అందుకుగాను ఆయన సోమవారం ఢిల్లీకి పంపిచారు. లిక్కర్ సిండికేట్లలో, అవినీతిలో పాలు పంచుకుంటున్న కొంత మంది మంత్రులపై నివేదికను తయారు చేసి ఆయన రంగారెడ్డికి చేతికి ఇచ్చారు. దాన్ని రంగారెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు అందజేసినట్లు సమాచారం.

కొంత మంది మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, పదవీ వ్యామోహంలో పడిపోయారని, వారు పార్టీకి ఎనలేని నష్టం కలిగిస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని రంగారెడ్డి నాయకత్వంలోని ఏడుగురు ప్రతినిధుల బృందం అహ్మద్ పటేల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎసిబి దాడుల్లో లిక్కర్ సిండికేట్లతో ప్రమేయం ఉందని బయటపడిన మంత్రులు, శాసనసభ్యుల వివరాలను, ఇసుక మాఫియాతో సంబంధాలున్న పార్టీ శాసనసభ్యుల వివరాలను వారు అహ్మద్ పటేల్‌కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. విశ్వాసపాత్రుడు, నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి ఉండడం వారికి ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వంపై, ప్రభుత్వ పథకాలపై తప్పుడు సమాచారం వ్యాపింపజేయడానికి వారంతా కుమ్మక్కయ్యారని ఆరోపించినట్లు తెలుస్తోంది.

ఆర్థిక శాఖలో ప్రవేశపెట్టిన గ్రీన్ చానెల్ వల్ల బిల్లుల్లో, చెల్లింపుల్లో అవకతవకలు లేకుండా పోయాయని, ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోని పద్ధతిలో అది నడుస్తోందని, చాలా మంది మంత్రులకు అది రుచించడం లేదని, నిధుల విడుదలను కూడా క్రమబద్దీకరించారని, కాంట్రాక్టర్లకు పని చేయకుండా డబ్పులు అందడం లేదని, ఇది కూడా నచ్చడం లేదని వారు అహ్మద్ పటేల్‌కు వివరించినట్లు సమాచారం. ఇలాంటి కొన్ని చర్యలు కొంత మంది మంత్రులకు నచ్చకపోవడంతో ముఖ్యమంత్రిపై దుష్ప్రచారానికి పూనుకుంటున్నారని రంగారెడ్డి బృందం అధిష్టానానికి విన్నవించింది.

English summary
In a counter offensive to expose the 'true colours' of some ministers in his cabinet, chief minister Kiran Kumar Reddy's close aides on Monday rushed to New Delhi and submitted a report to Congress president Sonia Gandhi's political secretary Ahmed Patel that detailed the involvement of some ministers in the liquor syndicate as well as acts of corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X